- మరో రెండేళ్లకు..డెడ్లైన్ 2028 జూన్
- మొదలైన పనులు..18 మీటర్లు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శ్రీశైల సొరంగ మార్గం వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2028 జూన్ నాటికి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పారు. అనుకోని ప్రమాదం వల్ల పనుల్లో జాప్యం జరిగిందని, సాంకేతిక సర్వేలు చేసిన అనంతరం ఇటీవలే పనులు మొదలు పెట్టామని చెప్పారు. 18 మీటర్ల మేర పనులు పూర్తియ్యాయని అన్నారు. ఇదే పద్ధతిలో పనులు కొనసాగితే 2028 నాటికి ప్రాజెక్టు పూర్తివుతుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సొరంగాన్ని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తి అయితేనే జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దాంతో బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్ కూడా పూర్తిచేస్తామని చెప్పారు.