- పార్టీ సీనియర్ నేత గుమ్మల మోహన్ రెడ్డి భార్య గుమ్మల జానకి కార్పోరేటర్
- స్టేట్ కార్పోరేషన్ చైర్మన్ పైనే ఆశలు
- మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య చైతన్య మేయర్,
- వైస్ చైర్మన్ అబ్బగోని భార్య కార్పోరేటర్
- నల్లగొండ కార్పోరేషన్లో ఆసక్తికర పరిణామాలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవి అడితే ఆయన భార్య జానకి కార్పోరేటర్ దక్కింది. గతంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఓడిపోయిన జానకి ఈ ఎన్నికల్లో తొలిసారి కార్పోరేటర్గా ఎన్నిక కావడం విశేషం. ట్రయాంగిల్ వార్లో ఏకంగా బీజేపీ అభ్యర్థి పైన 500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎప్పటికైనా తనకు కార్పోరేషన్ చైర్మన్ పదవి వస్తదనే నమ్మకంతో మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి ఆయనకు హామీ ఇచ్చారు. ఇక మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య తొలిసారిగా మేయర్గా రికార్డు సృష్టించారు. వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ భార్య కవిత కార్పోరేటర్గా ఎన్నికయ్యారు. చైతన్య, కవిత గతంలో మాజీ కౌన్సిలర్లు, కాగా, ఈసారి భర్తల బదులు భార్యలు కార్పోరేషన్లో అడుగుపెట్టనున్నారు.