- మిర్యాలగూడ, సూర్యాపేట, నాగార్జునసాగర్, భువనగిరిలో సత్తా చాటిన ఇరుపార్టీల క్యాండేట్లు
- రెబల్స్ గెలుపుతో కాంగ్రెస్కు కష్టకాలం
- నల్లగొండలో 88.74, సూర్యాపేటలో 89.55,యాదాద్రి జిల్లాలో 91.72 శాతం పోలింగ్
నల్లగొండ ప్రతినిధి : ఏపీబీ న్యూస్, డిసెంబర్ 14
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్ధతుదారుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో మెజార్టీ కాంగ్రెస్ మద్ధతుదారులే గెలుపొందినప్పటికీ, ధీటుగా బీఆర్ఎస్ సపోర్టర్స్, కాంగ్రెస్కు వ్యతిరేకంగా రెబల్స్ సత్తా చాటారు. కోదాడ నియోజకవర్గం మినహా, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, భువనగిరిలో రెండు పార్టీల మధ్య గట్టిపోటీ జరిగినట్టు ఫలితాలను చూస్తే తెలుస్తోంది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ మద్ధతుదారులు ఓడిపోవడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. ఆదివారం రాత్రి 9గంటల వరకు అందిన సమాచారం మేరకు నల్లగొండ జిల్లాలో 170 పంచాయతీల్లో కాంగ్రెస్ గెలుపొందగా, 50కి పైగా పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్ధతుదారులు గెలిచారు. సాగర్లో రెబల్స్ 31 మంది, మిర్యాలగూడలో 21మంది గెలుపొందారు. దామరచర్ల మండలంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గీయుల మధ్యనే అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో, కోదాడలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుపొందింది. ఇక్కడ బీఆర్ఎస్ ఎఫెక్ట్ కనిపించలేదు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లో బీఆర్ఎస్ మద్ధతుదారులు గెలుపొందారు. యాదాద్రి జిల్లా భువనగిరి సెగ్మెంట్లో 60 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు గెలుపొందగా, బీఆర్ఎస్ 50 చోట్ల గెలుపొందినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 19 మంది రెబల్స్ గెలుపొందారు. మొదటి, రెండు విడతల్లో ఆలేరు, భువనగిరిలో బీఆర్ఎస్ గట్టిగానే పోటీ ఇచ్చింది.
పోలింగ్ ప్రశాంతం…
రెండో విడత ఎన్నికలు 23 మండలాల పరిధిలో 539 సర్పంచ్ స్థా నాలకు, 4,280 వార్డులకు జరిగాయి. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నాం 1 గంటకు ముగిసింది. అన్ని చోట్ల ఉదయం 11 గంటలకే దాదాపు పోలింగ్ 50 శాతం పూర్తియ్యింది. చలి తీవ్రత వల్ల ఓటర్లు 9 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. నల్లగొండ జిల్లాలో 88.74 శాతం, సూర్యాపేట జిల్లాలో 89.55 శా తం, యాదాద్రి జిల్లాలో 91.72 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు…
నల్లగొండ జిల్లాలో మొత్తం ఓటర్లు 2,99,576 మందికాగా, 2,65, 852 (88.74) మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 1,46,709 మందికిగాను 1,30,941 (89.25), మహి ళలు 1,52,840 మందికిగాను 1,34,900 (88.26) మంది, ఇతరులు 27 మందికిగాను 11 (40.74)శాతం మంది ఓటేశారు.
సూర్యాపేట జిల్లాలో మొత్తం ఓటర్లు 2,35,137 మందికిగాను 2,1 0,576 మంది (89.55) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లలో పురుషులు 1,14,803 మందికిగాను 1,03,143 (89.84), మహిళలు 1,20,326 మందికిగాను 1,07,428 (89.28), ఇతరులు 8 మందిలో 5గురు (62.50) శాతం మంది ఓటు వేశారు.
యాదాద్రి జిల్లాలో మొత్తం ఓటర్లు 2,02,716 మందికిగాను 1,85, 939 (91.72) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 1,00,801 మందికిగాను 92,562 (91.83), మహిళలు 1, 01,915 మందికిగాను 93,375 (91.62) మంది ఓటేశారు.
పోలింగ్ సరళి ఇలా…
| జిల్లాపేరు | 9గంటలకు | 11గంటలకు | 1గంటకు (శాతం) |
| నల్లగొండ | 28.15 | 56.44 | 82.74 |
| సూర్యాపేట | 25.18 | 60.07 | 86.78 |
| యాదాద్రి | 20.92 | 57.12 | 82.53 |