Sarpanch Elections: మూడు మండలాల్లో కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్​ఎస్

  • ఆరు మండలాల్లో 120 పంచాయతీల్లో.. 57 కాంగ్రెస్, 23 బీఆర్ఎస్
  • మోతె, మునగాల, అనంతగిరిలో పోటాపోటీ..చిలుకూరు, నడిగూడెం, కోదాడలో కాంగ్రెస్ హవా

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్ : కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మూడు మండలాల్లో గట్టిపోటీ జరిగింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ చిలుకూరు, నడిగూడెం, కోదాడలో సత్తాచాటింది. మోతె, మునగాల, అనంతగిరి మండలాల్లో బీఆర్ఎస్ మెజార్టీ పంచాయతీలను సొంతం చేసుకుంది. మొత్తం 120 పంచాయతీల్లో కాంగ్రెస్ 58, బీఆర్ఎస్ 23, స్వతంత్రులు 8 మంది గెలుపొందారు. కేవలం ఐదు ఓట్ల మెజార్టీతో మునగాల కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా, మూడు ఓట్ల తేడాతో గుంజలూరు సర్పంచ్ గెలిచారు. కాంగ్రెస్ అత్యధికంగా అనంతగిరి మండలంలో 11, కోదాడ మండలంలో 12, మోతె మండలంలో 10 పంచాయతీల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ అనంతగిరిలో 4, మునగాలలో 6, మోతె మండలంలో 8 పంచాయతీల్లో అభ్యర్థులు గెలిచారు. ఇదే మండలంలో స్వతంత్రులు సైతం 4 గురు గెలుపొందడం గమనార్హం.

మండలం పేరుకాంగ్రెస్బీఆర్ఎస్
అనంతగిరి114
చిలుకూరు81
నడిగూడెం83
మునగాల96
కోదాడ121
మోతె108
Share
Share