దుప్పల్లి(APB News): తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో పోటీ హోరా హోరీగా సాగింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయిస్తే మరి కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది, మరికొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు భారీ మెజారిటీతో కూడా గెలిచారు. ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులలో ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. పల్లెల్లో, తండాలలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా చాలా గ్రామాలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా తొలి విడత ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి.

అయితే తొలి విడత ఎన్నికల ఫలితాలలో సర్పంచ్ అభ్యర్థులు కనబరిచిన పోటీని దృష్టిలో పెట్టుకొని రెండో విడత సర్పంచ్ అభ్యర్థుల వాళ్ళ గ్రామాలలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు టెక్నాలజీని, సోషల్ మీడియాని వాడుకొని ప్రచారం చేస్తున్నారు, మరికొందరు ఇంటింటికి తిరిగి ఓటును అభ్యర్థిస్తున్నారు. అయితే దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాత నాగరాజు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూనే లోకల్ ఎమ్మెల్యే అయినా జి. మధుసూదన్ రెడ్డి (GMR) సహాయంతో ఆఖరి రోజు ప్రచారంలో భారీ ఎత్తున ర్యాలీ తీస్తూ ఓట్లను ఆకర్షించారు. మొదటి నుండి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న సుజాత నాగరాజులు ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్ ను కలిసి వాళ్ళు గెలిచిన తర్వాత వారు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వివరించి ఓట్ల ప్రచారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 11వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న మండ్ల బాలకృష్ణ మరియు సర్పంచ్ అభ్యర్థి సుజాత నాగరాజులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఎమ్మెల్యే సహకారం ఇటు ప్రజల సహకారంతోటి సర్పంచ్ ఎన్నికలలో 100% గెలుస్తామనే ధీమా తోటి సుజాత నాగరాజు దంపతులు ఉన్నారు. అదేవిధంగా దుప్పల్లి గ్రామ ప్రజలంతా ఏకతాటి మీద సుజాత నాగరాజు దంపతులను వారి గ్రామ సర్పంచిగా గెలిపించాలని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. అయితే గ్రామ ప్రజల సహకారము ఎమ్మెల్యే సహకారం వీరికి కలిసివచ్చే అంశం.

