సాయినైసా’లో అధునాతన వైద్య సేవలు.. నల్లగొండలో కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

నల్లగొండ, ఏపీబీ న్యూస్: మెడికల్ హబ్గా మారిన నల్లగొండ పట్టణంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. గత ఆరేళ్ల నుంచి నల్లగొండలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ‘సాయినైసా’ ఆసుపత్రి’సూపర్ స్పెషాలిటీ తరహాలో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ బుర్రి చైతన్య చేతుల మీదుగా ప్రారంభంకానుంది. నల్లగొండకు చెందిన డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, డాక్టర్ రాపోలు దివ్య ఆసుపత్రిలో అందించనున్న వైద్య సేవల గురించి ‘ఏపీబీ న్యూస్’కు వివరించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలతో పాటు, లాప్రోస్కోపిక్, న్యూరో సర్జరీలు కూడా చేయనున్నారు. మహిళల్లో ఏర్పడే పైల్స్ తొలగించేందుకు ఇప్పటి వరకు నల్లగొండలో ప్రత్యేకంగా వైద్యులు లేరు. ఎంఎస్ సర్జన్ చేసిన డాక్టర్ దివ్య పైల్స్, రొమ్ము గడ్డల తొలగింపు, తీవ్రమైన కడుపునొప్పి సమస్యలకు ప్రత్యేకంగా వైద్య చికిత్స చేస్తామని చెప్పారు. ఆర్థోపెడిక్, అనెస్తీషియా, అంకాలజీ, నెఫ్రాలజీ రోగులను పరీక్షించేందుకు ప్రత్యేకంగా విజిటింగ్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు లభిస్తాయి.

రోగుల సంరక్షణ కోసం ప్రపంచ స్థాయి వసతులు:

  • అడ్వాన్స్ ఐసీయూ (Advanced ICU)
  • 24/7 అంబులెన్స్ సేవలు
  • ఎమర్జెన్సీ మెడికల్ కేర్
  • అడ్వాన్స్ మెడికల్ ఎక్విప్మెంట్
  • హైజినిక్ & కమ్ఫర్టేబుల్ రూమ్స్
  • క్విక్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్
  • అనుభవజ్ఞులైన డాక్టర్స్ & నర్సింగ్ స్టాఫ్
  • జనరల్ మెడిసిన్ & సర్జరీ
  • లేజర్ సర్జరీ & లాపరోస్కోపిక్
  • డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్
  • న్యూరోలజీ & ఆర్థోపెడిక్స్
  • గ్యాస్ట్రో ఎంటరాలజీ
  • డెర్మటాలజీ & గైనకాలజీ
Share
Share