మహేశ్వరం మండలంలోని పడమటి తాండ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మాజీ సర్పంచ్ సభావత్ అనితా రవి నాయక్,【లింగ్యా నాయక్】తో కలిసి ప్రారంభించి గ్రామ ప్రజలకు అంకితం చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ :- గతంలో కొన్ని సంవత్సరాలు గిరిజన సోదరులు తాండలను గ్రామ పంచాయతీలుగా చెయ్యలని చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు రాగానే తాండలను గ్రామ పంచాయతీలుగా చేసి వారి పాలన వారే నిర్వహించుకునేటట్లు చేసిన ఘనత కేసీఆర్ గారిదేనని. అందులో భాగంగానే నాగరం గ్రామ పంచాయతీలో ఉన్న పడమటి తాండను గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా గ్రామపంచాయతీకి కేటాయించిన నిధులతో తాండ రూపురేఖలు మారి పోయాయని,గత ప్రభుత్వంలొనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో నడిచాయని, ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీకి ఇవ్వలేకపోయిందని అన్నారు. తప్పనిసరి లోకల్ ఎలక్షన్స్ చెయ్యాల్సి వచ్చిన పరిస్తితి ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేనందున ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో మళ్ళీ రైతుబందు (రైతుబరోసా) ఇస్తామని మాయమాటలు చెప్తున్నారు. ఒకవేళ ఇచ్చిన ఎలక్షన్ కోసం ఒక్కసారే ఇస్తారని అన్నారు.
సంపూర్ణ రుణమాఫీ చెయ్యనేలేదు,రెండు సార్లు రైతుబందు ఎగ్గొట్టారు. 15 వేలు ఇస్తామన్న రైతుబరోసా 12 వేలకు కుదించారని అని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎం చేశారో చెప్పలేక 【చెప్పడానికి ఏమి చెయ్యలేదు】 వారి లోపాలను కప్పిపుచ్చుకునేందుకే గతప్రభుత్వం ఎం చేసిందని ఎదురు దాడి చేస్తూ కల్లబొల్లి మాటలు చెప్తున్నారని, గతంలో మీ మాయమాటలని నమ్మిన ప్రజలు ఇప్పుడు నమ్మేపరిస్థితిలో లేరని మీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, అధికారులు, BRS పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు,గ్రామ ప్రజలు,ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.