మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ సమీపంలో చౌహన్ హాస్పిటల్లో ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్లాక్ ను మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
మోమోగ్రామ్ సేవలను అందుబాటులోకి తెచ్చినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని యాజమాన్యాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.