రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన వ్రాత పరీక్షలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్రంలో ఎక్కడలేని విదంగా పక్కా బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్న తరువాత కళాశాలను ప్రారంభించామని గుర్తుచేశారు,అనంతరం కే.జి.బి.వి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి భోజనం చేస్తున్న విద్యార్థినిలతో పాటు కాసేపు కూర్చొని వారు తింటున్న బోజనాలను పరిశీలించారు. విద్యార్తినిలకు నాణ్యమన విద్యా, భోజనం వసతులు అందించే విదంగా కృషిచేయాలని ఉపద్యాయురాళ్లకు చెప్పారు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యులు పి.సబితా ఇంద్రారెడ్డి.

సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా,వైద్యం,వ్యవసాయం,ఉపాధి రంగాలను బలోపితానికి కేసీఆర్ కృషిచేశామన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ గాలికి వదిలేసి మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, BRS పార్టీ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.


