ఈటెల కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖా బోయలపల్లి

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి గారు సిఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఈటల గారు రెడ్డి కులమా? ముదిరాజ్ కులమా ప్రజలకి సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని కోపంలో ఈటల గారు ఇలా మాట్లాడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తీరును తెలంగాణ ప్రజానీకం తలదించుకునే విధంగా ఉంది. విద్యార్థుల ఆత్మ బలిధానంలో మంత్రి పదవి అనుభవించారు. బిఆర్ఎస్ హయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల ఉన్నపుడు తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసింది. హైడ్రా గురించి మాట్లాడే ఈటల దేవాదాయ శాఖ భూములను కబ్జా చేశారని కేసు ఉన్న విషయం మర్చిపోయారా? బీసీ బిడ్డవై కేసిఆర్ చెప్పినట్లు చేసిన విషయం మరిచారా ఈటెల గారు ? కేసీఆర్ హయంలో బానిసలు గా ఉన్న మీకు సీఎం రేవంత్ గారి గురుంచి మాట్లాడే నైతిక అర్హత లేదు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా? ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడానికి. కారణమైన కేసిఆర్ అలీబాబా చోరిస్ లో ఈటల గారు ఒకరు కాదా? విద్య, వైద్య పరంగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఆర్ధిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఈటల గారు , ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. బీసీ బిడ్డగా ఈటల రాజేందర్ గారిని ఎవరు అంగీకరించని పరిస్థితిలో లేరు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ నేతల వైఖరిని బీసీ సమాజం క్షమించే పరిస్థితి లేదు. తప్పులు ఎత్తి చూపండి..సద్వి విమర్శ చేయండి..అంతేగానీ స్వార్థంతో నోటికొచ్చింది మాట్లాడితే మాత్రం సహించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖా బోయలపల్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Share
Share