కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లు కుటుంబం ఎప్పుడు కూడా లైన్ దాటలేదని కవితమ్మ అంటుంది.
అమ్మ కవితమ్మ మీ కల్వకుంట్ల కుటుంబం లైన్ దాటకుండా మరియు లైన్ దాటి చేసిన మోసాలు చెప్తా విను. ఈ ఫార్ములా రేస్ లో మీ అన్న కేటీఆర్ లైన్ దాటి ప్రజా ధనం కొల్లగోడితే ఏసీబీ మీ అన్న మీద కేసు బుక్ చేసింది. నువ్వు ఏకంగా తెలంగాణ రాష్ట్ర లైన్ దాటి ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తీహార్ జైల్లో మూడు నెలల పాటు ఉన్నావు.నీ వల్ల అక్కడ ప్రభుత్వాలె కూలిపోయాయి.
మీ నాన్న కెసిఆర్ లైన్ దాటి ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చేత అలాగే మాజీ డిఎస్పి ప్రణీత్ రావు చేత ఇతర పార్టీల నాయకుల ఫోన్ టాపింగ్ చేసి గెలవాలని చూడలేదా..??మీ నాన్న కేసీఆర్ లైన్ దాటి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా..?? లైన్ దాటి కల్వకుంట్ల కన్నారావు భూకబ్జా చేసి జైలు పాలయ్యాడు.ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులని మీ నాన్న ఉసిగొల్పి మీ నాన్న కెసిఆర్ లైన్ దాటకుండా ఇంట్లో ఉండి పాపం ఎంతోమంది ఉద్యమకారుల చావుకు కారణమయ్యాడు. లైన్ దాటి ఆంధ్రకు తెలంగాణ నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా..??
మీ బావ హరీష్ రావు లైన్ దాటి మిగతా ప్రాజెక్టులను వదిలిపెట్టి నాణ్యత లేని కమిషన్ల కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాస్తవం కాదా..?? మీ కల్వకుంట్ల కుటుంబం మొత్తం లైన్ దాటి 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టుకొని అక్రమంగా సంపాదించింది వాస్తవం కాదా..?? అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు రేఖ బోయలపల్లి కల్వకుంట్ల కవిత పై మండి పడ్డారు.