SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో BRS నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రేఖ బోయలపల్లి

ఏ టన్నెల్ నిర్మాణం జరిగిన లీకేజ్ లు సర్వసాధారణం. పని పాట లేని BRS నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. సంఘటన జరిగిన మరుక్షణం నుండి రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి అక్కడే ఉండి సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఫోన్ లో అను నిత్యం పరిస్థితి తెలుసుకుంటున్నారు. సంఘటన స్థలానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు వెళ్లారు. ఈ రోజు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు రేఖ బోయలపల్లి అన్నారు.

Share
Share