ఓటుకు ముందు మహిళలు దేవతలు..ఓటు తర్వాత శూర్పణఖలా? రేఖ బోయలపల్లి

ఓటు వేసేంతవరకూ మహిళలు “దేవతలే”…
ఓటు పడిన తర్వాత మాత్రం బీజేపీ నేతలకైతే మహిళలు “శూర్పణఖలా” కనిపిస్తారట!

భారతీయ మహిళలు ఎప్పటికీ భారతీయ మహిళలే…మా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే బీజేపీకి తిరిగి ఓటు తోనే బుద్ధి చెప్పడం ఖాయం..ఎన్నికల ముందు అసభ్యంగా అనిపించని వస్త్రధారణ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తప్పుగా అనిపిస్తుందా?

ఇప్పటికీ మహిళల బట్టల పైనే దృష్టా..?
ఇది నిజంగా సనాతన ధర్మమా?
లేదా… బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ ధర్మమా?

మధ్యప్రదేశ్‌ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళల భద్రత, విద్య, ఉపాధి వంటి మౌలిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, వారి స్వేచ్ఛపై నిబంధనలు పెట్టే మీ సంస్కారమా?

నిజమైన సనాతన సంస్కృతి అంటే – మహిళలకు గౌరవం, స్వేచ్ఛకి అండగా ఉండటమే… పోలీసింగ్ చేయడమేమీ కాదు! ఓటేసేది మహిళలే…వారి గౌరవాన్ని తాకట్టు పెడితే, మీ భవిష్యత్తును నిర్ణయించేదీ అదే మహిళలు! నైతికత ప్రసంగించే పాలకులు – ప్రజాస్వామ్యానికి ముప్పు!

మతo-సంప్రదాయం పేరుతో మహిళలపై బురద జల్లే సంస్కృతి BJP పార్టీది, కానీ ఇది మన భారతీయ సంస్కృతి కాదు! అని బిజెపి నేతలపై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి

Share
Share