హైదరాబాద్(APB News): రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వేనెంబర్ 25 లోని 400 ఎకరాల భూముల వ్యవహారం మీద బీజేపీ, BRS దొంగ రాజకీయాలు మానితే మంచిది. అప్పట్లో 1700 ఎకరాలతో 1976 లో హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ స్థాపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం.. దాని పక్కన ఉన్న 800 ఎకరాలు నాడు ఉమ్మడి రాష్ట్రలో 2003లో IMG భారత్ అనే సంస్థకు అప్పగించింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ సంస్థ పనులు ప్రారంభించకుండా లేట్ చేయడం ద్వారా తర్వాత 2004లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆ భూమిని ప్రభుత్వ అవసరలకు తీసుకోవాలి అని కోరింది. దానిపై IMG భారత్ సంస్థ కోర్టుకి వెళ్ళింది నాటి నుండి కోర్ట్ లో పోరాడంగా నేడు రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. టిజిఐఐసి విజ్ఞప్తి మేరకు శేర్లింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ మరియు తాసిల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25 లోని 400 ఎకరాల పోరంబోకు సర్కారీ అంటే ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు.
సర్వేలో ఒక అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. ఇప్పుడు దాని అభివృద్ధి చేయాలి అనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాగానే గోతి కాడి నక్కలాగా కాచుకొని కూసున్న బీజేపీ, BRS నాయకులు ఇప్పుడు దొంగ రాజకీయాలు చేస్తున్నారు.. ప్రస్తుత ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయ నాయకులు స్థిరాస్థి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. అక్కడ ఎలాంటి అటవీ భూమి లేదు అని అటవీశాఖ అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు. నాడు సుప్రీమ్ కోర్ట్ లో ఉన్నప్పుడు ఒక్క బీజేపీ, BRS పార్టీలు రాలేదు కానీ నేడు ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని కొత్త నాటకం ఆడుతున్నారు. మీరు ఎన్ని డ్రామాలు చేసిన మీ ఆటలు సాగవు అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖా బోయలపల్లి వార్నింగ్ ఇచ్చింది.