పల్లెపోరులో…ప్రీమియం​ కిక్కు… కొత్త షాపుల్లో అదరగొట్టిన బోణీ

  • గ్రామాల్లో ఏరులైపారిన మద్యం..ఆర్డనరీతో పోలిస్తే… ప్రీమీయం బ్రాండ్లకే గిరాకీ
  • 329 షాపుల్లో 15 రోజుల్లో రూ.353 కోట్ల సేల్స్
  • గతేడాదితో డిసెంబర్తో పోలిస్తే రూ.203 కోట్లు అధికం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కొత్త వైన్స్షాపులకు తొలి బోణీ అదిరిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో లిక్కర్ బిజినెస్ కోట్లు కుమ్మరించింది. సాదాసీదా లిక్కర్ కంటే ఈ ఎన్నికల్లో ఖరీదైన లిక్కర్కే గిరాకీ పెరిగింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రధాన పార్టీల మద్ధతుదారులు గ్రామాల్లో లిక్కర్, బీర్లను ఏరులై పారించారు. యువతను ఆకట్టుకునేందుకు బీర్లు, ఇతర ఓటర్లకు లిక్కర్తో మత్తులో ముంచెత్తారు. ఒకనెలలో జరగాల్సిన పూర్తికావాల్సిన ఎక్సైజ్ టార్గెట్ కేవలం 15 రోజుల్లోనే కంప్లీట్ అయ్యింది. పట్టణం, పల్లె అనేతేడా లేకుండా అన్ని చోట్ల లిక్కర్ ప్రవహించింది. సాధారణంగా కొత్త షాపులు తెరిచే క్రమంలో డిపోల నుంచి వ్యాపారులు ఫుల్స్టాక్ కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి అధనంగా ఎన్నికలు కలిసిరావడంతో వ్యాపారులు అధనపు కోటాతో షాపుల్లో ఫుల్స్టాక్ పెట్టారు. పైగా ఈసారి షాపులు వికేంద్రీకరించారు. దీంతో బెల్టుషాపుల అవసరం లేకుండా నేరుగా వైన్స్షాపుల వద్దే ఎమ్మార్పీ ధరలకే మధ్యం అందుబాటులోకి వచ్చిం ది.

రోజుకు రూ.24 కోట్లు తాగేశారు..

రోజుకు రూ.24 కోట్లు చొప్పున డిసెంబర్ 1 నుంచి 15 వరకు రూ.3 53.02 కోట్ల విలువైన లిక్కర్ తాగేశారు. గతేడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు కేవలం రూ.149.74 కోట్ల సేల్స్ మాత్రం జరిగింది. ఈ పదిహేను రోజుల్లోనే ప్రభుత్వానికి అధనంగా రూ.203.28 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది డిసెంబర్లో 1 నుంచి 31 తేదీవరకు రూ.366 కోట్ల లిక్కర్ సేల్స్ కాగా, ఈ సారి 15 రోజుల్లోనే రూ.35 3.02 కోట్లు సేల్ కావడం విశేషం. ఎన్నికల వల్ల సర్కార్ టార్గెట్ 15 రోజుల్లోనే పూర్తియ్యింది.

సాధారణంగా ఎన్నికల్లో ఆర్డనరీ లిక్కర్, బీర్లకు గిరాకీ ఉంటుంది. కానీ అభ్యర్థులు ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓటుకు వెయ్యి నుంచి రూ.30వేలకు పంపిణీ చేశారు. చికెన్, మటన్, చీరల పంపిణీలో పల్లెల్లో పండగు వాతావరణాన్ని మరిపించారు. చీప్ లిక్కర్కు బదులు ఖరీదైన మద్యా న్ని ఓటర్లకు పంపిణీ చేయడంతో సర్కార్ ఆదాయం మరింత పెరిగింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు ఆర్డనరీ లిక్కర్ 18, 8 47 కాటన్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది అదే రోజుల్లో 1,39,131 కాటన్లు సేల్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే 1,20,284 కాటన్లు అధికం. అదేవిధంగా లిక్కర్ గతేడాది డిసెంబర్లో 25,427 కాటన్లు సేల్ కాగా, ఈ ఏడాది 3,15,188 కాటన్లు సేల్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే 2,89,761 కాటన్లు ఎక్కువ సేల్ అయ్యాయి. దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్ నగర్, నల్లగొండ, నాంపల్లి సర్కిళ్ల పరిధిలోనే సేల్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలోని 329 మద్యం షాపుల్లో ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు లిక్కర్ 3,40,615 పెట్టెలు అమ్ముడుకాగా, బీర్లు, 3,47,800 పెట్టెలు అమ్ముడయ్యాయి. గతేడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు లిక్కర్ 1,52,615 పెట్టెలు అమ్ముడుకాగా, బీర్లు 2,04, 512 పెట్టెలు సేల్ అయ్యాయి. అంటే గతేడాది డిసెంబర్తో పో లిస్తే లిక్కర్ 1,82,637 పెట్టెలు ఎక్కువ సేల్ కాగా, బీర్లు 1,43,283 పెట్టెలు సేల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో లిక్కర్తో పోలిస్తే బీర్లు 7,185 కాటన్లు సేల్ పెరిగింది.

జిల్లాపేరు2024 డిసెంబర్2025 డిసెంబర్
నల్లగొండరూ.68.48రూ.172.62
సూర్యాపేటరూ.43.68రూ.96.27
యాదాద్రిరూ.37.58రూ.84.13
మొత్తంరూ.149.74రూ.353.62
Share
Share