Breaking News: రాజ్యసభ ఎన్నికల నగారా: తెలంగాణలో 2 స్థానాలకు రసవత్తర పోటీ

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో, కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలు కూడా ఉన్నాయి.

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రారంభం కానుంది.

  • నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 05, 2026
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 06, 2026
  • ఉపసంహరణకు గడువు: మార్చి 09, 2026
  • పోలింగ్ తేదీ: మార్చి 16, 2026 (ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు)
  • ఓట్ల లెక్కింపు: మార్చి 16, 2026 (సాయంత్రం 5:00 గంటలకు)

ఈసారి అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్లలో చెరో 6 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో అభిషేక్ మను సింఘ్వీ, కె.ఆర్. సురేష్ రెడ్డిల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ (4), అస్సాం (3), ఒడిశా (3), ఛత్తీస్గఢ్ (2), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ (1) రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Upper house list

రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. శాసనసభలో రాజకీయ పార్టీలకు ఉన్న బలాబలాల ఆధారంగా ఈ ఫలితాలు వెలువడతాయి. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ రెండు స్థానాల కోసం ఆసక్తికరమైన పోరు నెలకొనే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు ఈసీ తెలిపింది.

Share
Share