- నంది కొండ మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ
- వైస్ చైర్మెన్ పదవి పై ఫోకస్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత కుందూరు జానా రెడ్డి ప్రధాన అనుచరుడు ప్రముఖ వ్యాపారవేత్త జీ. రాజేంద్ర ప్రసాద్ చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. గత 40 ఏళ్ల కు పైగా జానా రెడ్డి ఫ్యామిలీ తో సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రసాద్ చౌదరి నంది కొండ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నందికొండ 3 వార్డు నుంచి ఆయన కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎస్సీ లకు రిజర్వ్ కాగా, వైస్ చైర్మెన్ పదవి ని ప్రసాద్ ఆశిస్తున్నారు. ఆయన గతం లో ప్రభుత్వ టీచర్ గా పనిచేశారు. కొంత కాలం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి లిక్కర్ బిజినెస్ లో కి ప్రవేశించారు.
జానా రెడ్డి కొడుకులు కు వెన్నుదన్నుగా ఉంటున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీసులు కూడా ఉన్నాయని చెప్తుంటారు. ప్రసాద్ భార్య కూడా ప్రభుత్వ టీచరుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకు లు కాగా ఒక కుమారుడు సినిమా రంగంలో రాణిస్తున్నారు. మరొక కుమారుడు ఐటీ రంగంలో స్థిరపడ్డారు. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుల తో ఆయనకు మెరుగైన సంబంధాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు షాడో ఎమ్మెల్యే గా ఆరోపణలు ఎదుర్కొన్నా ప్రసాద్ చౌదరి మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం తో కాంగ్రెస్ కేడర్ లో జోష్ నెలకొంది. ఇన్నాళ్ళు సాగర్ లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కోటి రెడ్డి ఆదిపత్యం నడిచింది. ఇప్పుడు ప్రసాద్ ఎంట్రీ తో నంది కొండ రాజకీయాలు వేడెక్కునున్నాయి.