కొత్త ఏడాది.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమేనా?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొత్త ఏడాది కచ్చితంగా కలిసొస్తదనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. రెండేళ్లుగా ఊరిస్తున్న మంత్రి పదవి ఈ ఏడాది తప్పక వస్తదని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. రాజగోపాల్ మంత్రి పదవికి ఉన్న అడ్డంకులను అధిష్టానం ఒక్కోటి క్లియర్ చేస్తోంది. ఒకే జిల్లాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచె ప్పిన అధిష్టానం ఆ మేరకు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కేబినెట్ ఆశిస్తున్న సీనియర్లకు ప్రత్యామ్నయ పదవులు కట్టబెట్టి అసంతృప్తులను బుజ్జిగిస్తున్న అధిష్టానం రాజగోపాల్కు మాత్రం మంత్రి పదవి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. మొన్నటి వరకు రాజగోపాల్కు అడ్డుగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.

ప్రధాన అడ్డంకిగా ఉండని భావిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ప్రభుత్వ చీప్ విప్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రంగారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి రాసిన లేఖ అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. జానా లేఖ పైన రాజగోపాల్ తీవ్రస్థాయిలోనే ఫైర్ అయ్యారు. జిల్లాకు చెందిన కొందరు నేతలు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారనే కామెంట్లు చేశారు. ఈ పరిణామాల క్రమంలో రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ చేసేందుకు రంగారెడ్డి కి ప్రభుత్వ చీప్ విప్ ఇవ్వడంతో కేబినెట్ హోదా లభిస్తుందని భావిస్తున్నారు.

malreddy ranga reddy

మొదటి నుంచి పార్టీకి కట్టుబడి ఉన్న లీడర్లను కాదని మధ్యలో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల రాజగోపాల్ రెడ్డి గట్టిగానే వ్యతిరేకించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని, తమ్ముడుకు ఇవ్వాల్సి వస్తే అన్నవెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేయాల్సి వస్తదనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇటు రాష్ట్రంలో, పార్టీలో బ్రదర్స్ కు ఉన్న క్రేజ్ ఆషామాషీ కాదని, ఆ క్రేజ్తోనే భువనగిరి పార్లమెంట్ సీటు గెలుపు విషయమై తనకు ఇచ్చిన హామీ గురించి అధిష్టానం వద్ద తనవాధన వినిపించడంలో రాజగోపాల్ సక్సెస్ అయ్యారు. కొత్త ఏడాది ఆరంభంలోనే కార్పోరేషన్ పదవులు, కేబినెట్లో మార్పులు ఉండొచ్చనే సంకేతాలు పార్టీ నుంచి వస్తున్నందున ఈసారి మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారు.

కీలకమైన కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను మంత్రి పదవి ఆశిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మహిళా కోటాలో సూర్యాపేట జిల్లా నుంచి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఆర్టీసీ చైర్మన్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నియమించినప్పటికీ ఆమెకు నచ్చకపోవడంతో బాధ్యతలు చేపట్టలేదు. దీంతో గత ఆరు నెలల నుంచి ఆ పదవి ఖాళీ గానే ఉంది. ఇదిలావుంటే సీనియర్ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య (ఎస్సీ మాదిగ) పేరు కూడా పరిశీలనలో ఉంది. నల్లగొండ జిల్లాలో ఎస్సీలకు ఎలాంటి కీలకమైన పదవులు దక్కలేదు. నకిరేకల్ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు.

nalamada padmavathi reddy
Kondeti Mallaiah
Share
Share