మంథని(APB News): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కోరారు. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో విద్యుత్ షార్ట్సర్య్కూట్తో దగ్దమైన శివ శంకర్ కిరాణ దుకాణంను ఆయన పరిశీలించి బాధితుడు ఊదరి శివ శంకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో జీవనాధారమైన కిరణ దుకాణంలోని సామాన్లు, వస్తువులు కాలి బూడిదయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆధారం కోల్పోయిన బాధితుడికి సాయం అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రమాదంపై అధికారులు స్పందించి ప్రభుత్వపరంగా ఆదుకునే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

