- ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం దుర్మార్గం
- 2029 నాటికి రాహుల్ ప్రధాని కావడం ఖాయం : డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత
నల్లగొండ, ఏపీబీ న్యూస్: భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీని ప్రధాని మోడీ దేశంలో లేకుండా చేసేందుకు కుట్రలు పనన్నుతున్నాడని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత అన్నారు. ఆదివారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ 141 వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా శివాజీ నగర్ సెంటర్ వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శివాజీనగర్ చౌరస్తా నుంచి రామగిరిలో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…లౌకిక రాజ్యం,ప్రజాస్వామ్యం సామజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏ లో భాగమన్నారు. దేశంలోని బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణ పేదల సంక్షేమంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. 2029 నాటికి దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన చెప్పారు. 2029 లో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కన్నారావు, ఎండి ముంతాజ్ అలీ ,బోడ స్వామి, నూనె కోటి, జిల్లా పరమేష్, సుధాకర్ ముదిరాజ్, పుట్టవెంకన్న,రాంబాబు నాయుడు రవితేజ తదితరులు పాల్గొన్నారు.