న్యూఇయర్​ వేడుకలు..బీకేర్​ ఫుల్..అతిగా ప్రవర్తిస్తే తాట తీస్తామంటున్న పోలీసులు

  • పోలీస్​ శాఖ కఠినమైన ఆంక్షలు
  • వీడియోలు, ఫోటోల ఆధారంగా కేసులు

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ శరత్​ చంద్రపవార్​ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఆదేశాల మేరకు నడుచుకోవాలని చెప్పారు. డీజేలకు అనుమతి లేదని, ఓవర్​ స్పీడ్​తో రోడ్ల పైన వెహికిల్స్​ నడపరాదని, మద్యం సేవించి రోడ్ల పైన తిరిగితే కేసులు పెడ్తామని వార్నింగ్​ ఇచ్చారు. ఫాం హౌజ్​లు, గెస్ట్​హౌజ్​ల్లో ఈవెంట్స్​కు పర్మిషన్​ తీసుకోవాలని, విచ్చల విడిగా, పొరుగువారికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ప్రధాన జంక్షన్లలో డ్రంకన్ డ్రైవ్ , రోడ్లపై గస్తీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధి లో సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వాహానాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారని, ఈ సందర్భంగా ఫోటో గ్రాఫి, వీడియో గ్రాఫీలు తీసిన తర్వాత వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

Share
Share