హైదరాబాద్, ఏపీబీ న్యూస్:
సీఎం కు ఎంపి చామల శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం ను శాలువా తో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్


యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా కి విషెస్ చెప్పిన కొత్త కలెక్టర్ చంద్రశేఖర్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీ సోమవారం హైదరాబాద్ లో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బడుగు చంద్ర శేఖర్.

