మిర్యాలగూడ…మరో పల్నాడు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై నలమోదు సిద్ధార్ధ ఫైర్

మిర్యాలగూడ, ఏపీబీన్యూస్: మిర్యాలగూడ పట్టణం మరో పల్నాడు ప్రాంతంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు కొడుకు సిద్ధార్ధ ఫైర్ అయ్యారు. ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్ధార్ధ మాట్లాడుతూ మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు. పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే గా గెలిపించుకున్న పాపానికి ఈ ప్రాంత ప్రజలు ఫలితం అనుభవించాల్సి వస్తోందన్నారు.

nallamothu siddartha protest

మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కుటుంబం నుంచే ముగ్గురిని పోటీ చేయించి రాచరిక వ్యవస్థకు పునాది వేశారని, వాళ్లతో పాటే మరో 45 మందిని కూడా పల్నాడుకు చెందిన లీడర్లనే నిలబెడితే మొత్తం మున్సిపాలిటీ పల్నాడు ప్రాంతంగా మారేదని ఎద్దేవ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోకపోతే మున్సిపాలిటీ కచ్చితంగా పల్నాడులో కలవడం ఖాయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ను సిట్ పేరుతో ఇబ్బంది పెడుతుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని, సిటీ విచారణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలోనే పోరాడేందుకు సిద్ధమవుతామని సిద్ధార్ధ హెచ్చరించారు.

nallamothu siddartha rally
Share
Share