‘వెన్న’డిస్ట్రిబ్యూటర్తో రహస్య భేరసారాలు.. రూ.12 కోట్ల రహస్య ఒప్పందం?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్)లో 2009 నుంచి 2023-24 వరకు జరిగిన అక్రమాల బాగోతాన్ని మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూధన్ రెడ్డి ఆధారాలతో బయట పెట్టారు. గురువారం చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత మేనేజింగ్ డైరక్టర్ కృష్ణ, గత చైర్మన్లు, పలువురు డైరక్టర్లు కుమ్మకై డెయిరీని దివాళా తీయించిన తీరును ఎండగట్టారు. ఎండీని తొలగించడంలో లేవనెత్తిన అభ్యంతరాలు, బ్యాంకులను మోసం చేయడం, డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టడం, భూముల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, ఆడిటర్లు, బ్యాంకు మేనేజర్లు అక్రమాలు, ఎన్డీడీబీని డెయిరీలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్న వైనం గురించి మాజీ చైర్మన్ వివరించారు.
నష్టాలను లాభాలుగా చూపెట్టి
మధుసూధన్ రెడ్డి 2024లో చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను డెయిరీ రూ. 35.15 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు జనరల్ బాడీ తీర్మానం కాపీలో చూపెట్టారు. అదే తీర్మానంలో పాడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా రూ.1.84 కోట్లు లాభం ఉన్నట్టు చూపారు. కానీ అప్పటికే డెయిరీ ఆస్తులు బ్యాంకుల్లో తనఖా పెట్టడం జరిగింది. ఈ ఆస్తులను జప్తు చేస్తారనే భయంతో గత పాలకవర్గం నష్టాలను, లాభాలుగా చూపించి బోగస్ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ను డీసీఓకు చేరడంతో అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. రిపోర్ట్ ను పరిశీలించిన డీసీఓ డెయిరీ లాభాల్లో అయినా ఉండాలి? లేదా నష్టాల్లో ఉండాలి? కానీ నష్టాల్లో ఉన్నదాన్ని లాభాల్లో ఎలా చూపిస్తారు? అని అభ్యంతరం చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన డీసీఓ పాత ఆడిట్ రిపోర్ట్ లెక్కలను తిరగతోడారు. ఏకంగా రూ.10 కోట్లు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. దీంతో డీసీఓ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు ఫిర్యాదు చేశారు.
నష్టాలకు ఇన్కం టాక్స్ కట్టిన ఘనులు
2015-16లో డెయిరీలో రూ.8.50 కోట్లు నగదు ఉండగా, రూ.12 కోట్ల రైతుల సొసైటీల డిపాజిట్లు ఉండే, కానీ ఒక్క ఏడాదిలో ఊహించని రీతిలో రూ.8.50 కోట్లు నష్టపోయింది. ఈ నష్టాలను పూడ్చడం పైన అప్పటి పాలకవర్గం దృష్టి పెట్టలేదు. దాంతో ఈ నష్టాలు ఏటికేడు పెరుగుతూ రూ.46 కోట్లకు చేరింది. నష్టాలు చూపిస్తే బ్యాంకుల నుంచి రుణాలు పొందలేమని భావించి డెయిరీ రూ. 8.50 కోట్లు లాభాల్లో ఉన్నట్టు దానికి ఇన్కం టాక్స్ రూ.2.70 కోట్లు కట్టినట్టు చూపారు. ఆ తర్వాత మధుసూధన్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యే నాటికి డెయిరీ రూ.35 కోట్లు నష్టాల్లో ఉన్నట్టు జనరల్ బాడీ తీర్మానంలో చూపారు. కానీ అదే తీర్మానంలో రూ.1.84 కోట్లు లాభాల్లో ఉందని, దానికి రూ.45 లక్షలు ఆదాయపన్ను కట్టినట్టు మరో లెక్క చూపారు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకులు పాలకవర్గం పైన చీటింగ్ కేసు పెడ్తామని హెచ్చరించారు.
చేతులు కలిపిన ఆడిటర్లు, బ్యాంకు మేనేజర్లు
డెయిరీని ఆర్ధికంగా దివాళ తీయించడంలో ఆడిటర్లు, బ్యాంకు మేనేజర్ల పాత్ర కూడా ఉంది. ఎన్డీడీబీ మధర్ డెయిరీని టేకోవర్ చేయాలనుకున్నప్పుడు బ్యాంకుల నుంచి ఎన్ఓసీ (నిరంభ్యంతర సర్టిఫికె ట్) కావాలని కండీషన్ పెట్టారు. కానీ డెయిరీ ప్లాంట్, మిషనరీతో సహా, చిట్యాల, నార్కట్పల్లి, చండూరు చిల్లింగ్ సెంటర్ భూములు సైతం బ్యాంకుల్లో తనఖా పెట్టారు. అయితే నష్టాల్లో ఉన్న సంస్థకు ఎన్ఓసీ ఇచ్చేందుకు మేనేజర్లను సైతం మభ్యపెట్టారు. 2015 నుంచి మేనేజర్లను మ్యానేజ్ చేస్తూ రావడం వల్ల ఎన్ఓసీ ఇవ్వలేదు. డెయిరీ ఆడిటర్లు సైతం బోగస్ ఆడిట్ నివేధికల పైన సంతకాలు చేసి ఇరుక్కున్నారు. డెయిరీలో రూ.25 కోట్ల స్టాకు ఉందని బ్యాంకులను మోసం చేశారు. ముంబై నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ డెయిరీలో స్టాక్ చెక్ చేయగా రూ.3, 4 కోట్లకు మించి నిల్వ లేదని తేలింది. అప్పటికే రూ.35 కోట్లు నష్టాలు ఉండటంతో డెయిరీ ఎన్పీఏ పరిధి లోకి వెళ్లిపోయింది. ముంబై నుంచి బెంగళూరులోని బ్యాంకు ఉన్నత స్థాయి కమిటీ కి డెయిరీ వ్యవహారం వెళ్లింది.
అంతులేని ఎండీ కృష్ట అక్రమాలు
డెయిరీలో ఎండీ కృష్ణ అక్రమాలకు పాలకవర్గంలోని డైరక్టర్ల సపోర్ట బలంగా ఉంది. మాల్, మల్లేపల్లి, కందుకూరులో చిల్లింగ్ సెంటర్లలో పాలను కల్తీ చేసిన సంఘటనలో ఎండీ పైన ఎస్ఓటీ పోలీసులు కేసు పెట్టారు. సీనియర్లను పక్కన పెట్టి అడ్డదారిలో ఎండీ పదోన్నతి పొందారు. రూల్స్ ప్రకారం పాలు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ ఒకే రేటు ఫిక్స్ చేస్తారు. కానీ ఎండీ మాత్రం పాలవకర్గం తీర్మానం కాపీని ట్యాంపరింగ్ చేశారు. లీటర్కు రూ.2లు ఎక్కువ చెల్లించి నలుగురు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రతి నెల లక్షల సొమ్ము కాజేశారు. అంతేగాక ఆడిట్ రిపోర్ట్ల్లో గుర్తించిన అక్రమాలను విచారించేందుకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ఆర్సీఎస్) డీసీఓ(DCO)తో పాటు, ప్రత్యేక విచారణ కమిటీ నియమించింది. ఈ కమిటీలోని పలువురు ఆఫీసర్లను సైతం ఎండీ మభ్యపెట్టి విచారణ తొక్కిపెట్టారు. చైర్మన్కు చెప్పకుండా పాల ట్యాంకర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు.
ఎన్డీడీబీ(NDDB)ని అడ్డుకున్న ఎండీ, డైరక్టర్లు..
నష్టాల్లో ఉన్న డెయిరీని కాపాడేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో మధుసూధన్ రెడ్డి పాలకవర్గం ఢిల్లీ వెళ్లి ఒప్పందం చేసుకుంది. కానీ ఎన్డీడీబీ ఎంటర్ అయితే డైరక్టర్లు, ఎండీ కృష్ణ మంత్లీ ఇన్కం కు గండి పడుతుందనే ఉద్దేశంతో అనేక ఎత్తులు వేశారు. ఒప్పందంలో భాగంగా ఎన్డీడీబీ రూ.20 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చింది. ఇంకో రూ.25 కోట్లు బ్యాంకు ఇవ్వాలని ఎన్డీడీబీ ప్రతిపాధించింది. బ్యాంకు ఉన్నతాధికారులు ఆ ప్రతిపాధన హైదరాబాద్ మేనేజర్కు పంపారు. ఆడిట్ రిపోర్ట్లో ఏది తప్పు? ఏది కరెక్ట్ అనేది ఆడిటర్ సంతకం పెడితే రూ.25 కోట్లు ఇస్తానని ఒప్పుకుంది. ఈ మేరకు ఆడిటర్తో సంతకం తీసుకునేందుకు చైర్మన్, డైరక్టర్లు, ఏ ఓ(AO) వెళ్లారు. కానీ ఇప్పటికే తాను అన్ని చోట్ల ఇరుక్కు పోయాయని, పైగా ఆడిట్ రిపోర్ట్ ఆర్సీఎస్(RCS)కు వెళ్లిపోయిందని, నన్ను సంతకం చేయోద్దని మాజీ చైర్మన్ ఫోన్లో బెదిరించాడని ఆడిటర్ చెప్పడంతో ఆ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఎన్డీడీబీ ఒప్పందం ముందుకు సాగలేదు. 23 ఏళ్ల నుంచి ఆడిటర్గా చేస్తున్న అతను డెయిరీ అక్రమాల్లో ఎండీతో పాటు కీలక పాత్ర పోషించారు.
ఎండీని తొలగించమని మండలి చైర్మన్ చెప్పినా వినలే…
ఎండీ కృష్ణను తొలగించమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంత చెప్పినప్పటికీ డైరక్టర్లు ఒప్పుకోలేదు. జనరల్ బాడీలో ఎండీ ని తొలగించమని తీర్మానం చేశారు. దాంతో అతన్ని తీసేశాం. కానీ మళ్లీ డైరక్టర్లు అందరు ఏకమై కొత్త ఎండీ వచ్చే వరకు తాత్కాలికంగా కొన సాగించామని వంతపాడారు. చైర్మన్ మధుసూధన్ రెడ్డి నిర్ణయాని కి వ్యతిరేకంగా ఎండీని కొనసాగించాల్సి వచ్చింది. డెయిరీలో ఇబ్బందుల గురించి ఉద్యోగులు ఏకమై మండలి చైర్మన్ గుత్తాను కోరినప్పుడు కూడా ఎండీని తొలగించమని సలహా ఇచ్చారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, పొరపాటున ఎక్కడ కూడా సంతకాలు చేయోద్దని సుఖేందర్ రెడ్డి, చైర్మన్ మధుసూధన్ రెడ్డిని హెచ్చరించారు. దాంతో డైరక్టర్లు, ఆడిటర్లు, ఎండీ ఎంత ఒత్తిడి చేసినస్పటికీ బోగస్ ఆడిట్రిపోర్ట్ పైన మధుసూధన్ రెడ్డి సంతకం చేయలేదు. చైర్మన్ సంతకం లేకుండానే రూ.46 కోట్లు నష్టాల్లో ఉన్నదాన్ని రూ.14కోట్లకు తగ్గించి బ్యాంకులను మోసం చేశారు. అంతేగాక మధుసూధన్ రెడ్డి 90 మంది ఉద్యోగులను, అధికారులను బదిలీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల పైన వేటు వేశారు. చిల్లింగ్ సెంటర్ల నుంచి డైరక్టర్లకు, ఎండీకి మంత్లీ మామూళ్లను రాకుండా అడ్డుకున్నారు. ఎండీ కృష్ణను పక్కన పెట్టి ఎన్డీడీబీ నుంచి కొత్త ఎండీని నియమిస్తామని చెప్పారు. నిజంగానే ఎన్డీడీబీ రంగంలోకి దిగితే డైరక్టర్లు, ఎండీ, ఆడిటర్ల ఆటలు సాగవని వ్యూహాత్మకంగా వెన్న డిస్ట్రిబ్యూటర్ ను రంగంలోకి దింపి రూ.12 కోట్లతో డీల్ కుదర్చుకున్నారు.
వెన్నడిస్ట్రిబ్యూటర్తో సీక్రెట్ డీల్..
కొత్తగా ఎన్నికైన చైర్మన్, డైరక్టర్లు, ఎండీ కుమ్మకై వెన్న(బటర్) డిస్ట్రిబ్యూటర్తో రహస్య ఒప్పందం చేసుకున్నారు. మధుసూధన్ రెడ్డి ఉన్నప్పుడు ముందుకురానీ వెన్నడిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ. 12 కోట్లు ఇస్తానని ముందుకు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఒప్పందంలో భాగంగా సదరు డిస్ట్రిబ్యూటర్ రూ.3కోట్లు జమ చేశాడు. బ్యాలెన్స్ ఈ నెలాఖరు వరకు జమ చేస్తానని ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ డీల్ వెనక మతలబు ఏందనేది ఎవరకీ అంతుచిక్కడం లేదు.
ఇదిగో… మధర్ డెయిరీ అక్రమాల చిట్టా…ఏకంగా పాలని కల్తీ చేశారు.