BIG News: మున్సిపాలిటీల వారిగా ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ ల లిస్ట్ ఇదే..

నల్గొండ/భువనగిరి, ఏపీబీ న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు ఉమ్మడి నల్గొండ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రధాన మున్సిపాలిటీలకు మేయర్, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, పలు చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరగడం విశేషం.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా 32వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా, డిప్యూటీ మేయర్గా 45వ డివిజన్ కార్పొరేటర్ అశ్రఫ్ అలీ మొహమ్మద్ (ఆమేర్) ఎంపికయ్యారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గంతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీలో మహిళా ప్రాధాన్యత కనిపిస్తోంది. నూతన చైర్పర్సన్గా చిలుకూరి సుధా బాలకృష్ణ ఎన్నికయ్యారు.

అలాగే వైస్ చైర్పర్సన్గా గుడిపాటి శిరీష నవీన్ బాధ్యతలు స్వీకరించారు. వీరి ఎన్నిక పట్ల పట్టణ ప్రజలు మరియు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు సమక్షంలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

మున్సిపల్ చైర్మన్: తంగాళ్లపల్లి శ్రీవాణి రవి (35వ వార్డు, కాంగ్రెస్)

వైస్ చైర్మన్: పోతంశేటి మంజుల వెంకటేష్ (29వ వార్డు)

కోదాడ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి విషయంలో పార్టీ అంతర్గత ఒప్పందంలో భాగంగా ‘ఫిఫ్టీ-ఫిఫ్టీ’ ఫార్ములాను ఖరారు చేశారు.

తొలి రెండేళ్లు: ఎర్నేని కుసుమ (చైర్మన్), దేవరం మల్లీశ్వరి రెడ్డి (వైస్ చైర్మన్).

తర్వాతి మూడేళ్లు: పార సత్యవతి (చైర్మన్), గుండపనేని పద్మావతి (వైస్ చైర్మన్).

సూర్యాపేట మున్సిపల్ పీఠాన్ని మహిళా నేత కైవసం చేసుకున్నారు.

చైర్మన్: మొరిశెట్టి నివేదిత లక్షాది

వైస్ చైర్మన్: షఫీ ఉల్లా

ఉమ్మడి జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో ఎన్నికైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

మున్సిపాలిటీచైర్మన్వైస్ చైర్మన్
హాలియాచింతల చంద్రారెడ్డిగౌని రాజా రమేష్ యాదవ్
పోచంపల్లితడక వెంకటేశ్వర్లు (కాంగ్రెస్)కొయ్యడ రజిని
యాదగిరిగుట్టగుండ్లపల్లి వాణి భరత్ గౌడ్బరిగే రమ్య రాంచందర్
చండూర్కోడి శ్రీనివాసులుభూతరాజు దశరథ
తిరుమలగిరిసంకేపల్లి రఘునందన్ రెడ్డిఏమోజు గోవిందమ్మ
మోత్కూరుగడ్డం స్వప్న (SC)

ముఖ్య గమనిక: హుజూర్ నగర్ పురపాలక సంఘం 20వ వార్డు కౌన్సిలర్గా దొంతగాని శ్రీనివాస్ నేడు ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేశారు.

నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా అధికార పార్టీలో పదవుల పంపకం మరియు ఏకగ్రీవ ఎన్నికలు పార్టీ క్యాడర్లో జోష్ను పెంచాయి.

Share
Share