Great: ఒక్క ఏడాదిలోనే 65,522 కేసులు పరిష్కారం..

  • ఒక్క ఏడాదిలో లోక్​ అదాలత్​లో 65,522 కేసులు పరిష్కారం
  • గతేడాదితో పోలిస్తే నల్లగొండ అధికం, సూర్యాపేటలో స్వల్పం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఒక్క ఏడాదిలో లోక్​ అదాలత్​లో 65,522 కేసులకు పరిష్కారం లభించింది. ప్రధానంగా మోటర్​ వాహనాల చట్టం కింద నమోదైన కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు, పిటీ కేసులన్నీ లోక్ ​అదాలత్​లోనే పరిష్కారమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్​ 20 వరకు నల్లగొండ జిల్లాలో 49,943 కేసులు పరిష్కారం కాగా, సూర్యాపేట జిల్లాలో 15,579 కేసులు కొట్టేశారు. గతేడాదితో పోలిస్తే నల్లగొండ జిల్లాలో 31,686 కేసులు పెరిగితే, సూర్యాపేట జిల్లాలో 6,180 కేసులు తగ్గాయి. పలు కేసుల్లో నిందితులకు శిక్ష కూడా పడింది.

నల్లగొండ20242025
యూఐ కేసులు84254
పీఐ కేసులు2,4312,917
పిటీ కేసులు9,29629,143
ఎంవీ యాక్ట్​, డ్రంకెన్​ డ్రైవ్6,44617,626
మొత్తం18,25749,943
సూర్యాపేట20242025
లోక్​ అదాలత్​ కేసులు2,3792,439
పీటీ కేసులు16,3668,572
డిస్పోజ్​ చేసిన కేసులు3,014                       4,568
మొత్తం                   21,759                     15,579
Share
Share