APB News Exclusive: ఇప్పటికైతే… పాతాళ గంగ సేఫ్.. ఎండలు ముదిరితే ఈ మండలాలు కష్టమే

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో భూగర్భజల నీటి మట్టాలు సేఫ్ జోన్లోనే ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.78 మీటర్ల ఎత్తులోకి నీటి మట్టాలు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 7.74 మీటర్ల ఎత్తులో నీటి మట్టాలు ఉండగా, ఈ ఏడాది 5.96 మీటర్లకు ఎత్తుకు చేరాయి. మొత్తం 33 మండలాల్లో అత్యధికంగా నీటి మట్టాలు ఎత్తులో గుడిపల్లి మండలంలో కేవలం 0.55 మీటర్ల ఎత్తులోనే ఉండటం గమనార్హం. అత్యల్పంగా దామరచర్ల మండలంలో 12.43 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. గతేడాది భారీగా కురిసిన అకాల వర్షాలు, మూసీ, నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో ఈ ఏడాది నీటిమట్టాలు పడిపోకుండా ఉన్నాయి. జిల్లా లోని చెరువుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. దీంతో బోరు బావుల్లో నీటి నిల్వలు పెరిగాయి. అయితే మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట స్థాయిని దాటి పగటి పూట టెంపరేచర్స్ 36 డిగ్రీలకు చేరింది. దీంతో వడగాల్పులు సైతం వీస్తున్నాయి. ఇవే పరిస్థితులు మున్ముందు మరింత ఉదృతంగా మారితే నీటి మట్టాలు పడిపోయే ఆస్కారం ఉండొచ్చని భూగర్భజల నీటి వనరుల విభాగం నివేధికలు స్పష్టం చేస్తున్నాయి.

33 మండలాల్లో 7 మీటర్ల నుంచి 12 మీటర్ల ఎత్తులో నీటి మట్టాలు ఉన్న మండలాల్లో పరిస్థితులు కష్టంగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పంటల సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నీటి వినియోగం ఫిబ్రవరిలో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ప్రభావం నీటిమట్టాల పైన పడుతుంది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరితో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా చండూరు, చింతపల్లి, చిట్యాల, దామరచర్ల, దేవరకొండ, గట్టుప్పుల్, డిండి, గుర్రంపోడు, కట్టంగూరు, మర్రిగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నేరేడు గొమ్ము, నిడమనూరు, తిరుమలగిరి మండలాల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మండలం పేరుఫిబ్రవరి 2025ఫిబ్రవరి 2026
అడవిదేవుపల్లి4.414.01
అనుమల5.243.69
చందంపేట7.995.30
చండూరు9.008.17
చింతపల్లి11.327.91
చిట్యాల11.596.03
దామరచర్ల15.9412.43
దేవరకొండ8.106.10
గట్టుప్పుల్7.516.78
డిండి12.597.12
గుర్రంపోడు4.433.01
కనగల్7.485.01
కట్టంగూరు10.437.00
కేతేపల్లి2.530.81
కొండమల్లేపల్లి5.693.28
మాడ్గులపల్లి8.165.67
మర్రిగూడ10.9810.24
మిర్యాలగూడ2.071.36
మునుగోడు10.478.51
నకిరేకల్6.877.98
నల్లగొండ7.736.40
నాంపల్లి12.882.55
నార్కట్పల్లి7.615.87
నేరేడుగొమ్ము7.216.53
నిడమనూరు7.936.30
పీఏపల్లి6.044.55
పెద్దవూర6.315.60
శాలిగౌరారం4.864.17
తిప్పర్తి2.671.46
తిరుమలగిరి7.387.43
త్రిపురారం2.642.00
వేములపల్లి3.242.83
గుడిపల్లి3.530.55
Share
Share