మహిళల పైన ఈ ఏడాది లైంగిక​ వేదింపులు, రేప్, మర్డర్, కిడ్నాప్ కేసులు ఎన్నంటే

  • మహిళల పైన వేదింపులు ఆగట్లే ! కఠినమైన శిక్షలు విధిస్తున్న ఆగని ఆగడాలు
  • ఈవ్​టీజింగ్​లకు గురివుతున్న యువతులు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: మహిళలు, యువతుల రక్షణ కోసం కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నప్పటికీ వేదింపులు మాత్రం ఆగడం లేదు. క్రైమ్​ రికార్డ్స్​ ప్రకారం మహిళల పైన వేదింపులు తగ్గినట్టు చూపిస్తున్నా..కేసుల తీవ్రత లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా మహిళలు, యువతుల పైన వివిధ రకాల వేదింపులు, రేప్​లు, కిడ్నాప్​లు పూర్తిస్థాయిలో కంట్రోల్​ కావడం లేదు. పోలీసుల కన్నుగప్పి జరుగుతున్న ఇలాంటి కేసుల్లో మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు.

crime

నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 2024లో 679 మంది మహిళలు వేదింపులకు గురికాగా, ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్​ 20 వరకు మహిళలను వేదించినందుకు గాను 684 మంది పైన కేసులు నమోదయ్యాయి. గతేడాది 185 రేప్​ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మహిళల పైన హత్యాచారం చేసినందుకుగాను 147 మంది పైన కేసులు పెట్టారు. 54 మంది మహిళలు గతేడాది కిడ్నాప్​కాగా, ఈ ఏడాది 62 మంది కిడ్నాప్​ అయ్యారు. లైంగింక వేదింపులు గేతడాది నల్లగొండ జిల్లాలో 216 మంది మహిళలు లైంగిక వేదింపుల కేసులు నమోదు కాగా,ఈ ఏడాది 196 కేసులు నమోదయ్యాయి. ఇక షీటీమ్స్​ సూర్యాపేట జిల్లాలో పిటీ కేసులు ఈ ఏడాది 32, నల్లగొండ జిల్లాలో 160 కేసులు పెట్టారు. నల్లగొండ జిల్లాలో షీటీమ్స్​కు వచ్చిన ఫిర్యాదు మేరకు రెడ్​హ్యాండెండ్​గా ఈ ఒక్క ఏడాదిలోనే 423 మందిని పట్టుకున్నారు. 5,751 హాట్​స్పాట్స్​లో విజిట్​ చేశారు.

జిల్లాల వారీగా నమోదైన కేసులు…

నల్లగొండ జిల్లా:

కేసులు20242025
వేదింపులు313346
రేప్10187
కిడ్నాప్2627
లైంగిక వేదింపులు216196
షీటీమ్​ పిటీ కేసులు78160
రెడ్​హ్యాండెండ్78423

సూర్యాపేట జిల్లా:

కేసులు20242025
వేదింపులు366338
రేప్8460
కిడ్నాప్2835
లైంగిక వేదింపులు6738
షీటీమ్​ పిటీ కేసులు9832
Share
Share