నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ 45 డివిజన్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం ప్రకటించారు. నల్లగొండను తెలంగాణలోనే నంబర్ వన్ ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా మార్చడమే లక్ష్యంగా ఈ ఎంపిక జరిగినట్లు ఆయన వెల్లడించారు.
మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య
నల్లగొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. 32వ డివిజన్ నుండి ఆమె పోటీ చేయనున్నారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
| క్ర.సం. | డివిజన్ నెం. | రిజర్వేషన్ | అభ్యర్థి పేరు |
| 1 | 1వ డివిజన్ | బి.సి. జనరల్ | అలకుంట్ల నాగరాజు (చిట్టి) |
| 2 | 3వ డివిజన్ | యస్.సి. మహిళ | గాలి వినోద(నాగరాజు) |
| 3 | 4వ డివిజన్ | యస్.సి. మహిళ | బోగరి సింధు(ఆనంద్) |
| 4 | 5వ డివిజన్ | జనరల్ మహిళ | పున్న జాన్జేశ్వరి(గణేష్) |
| 5 | 6వ డివిజన్ | జనరల్ మహిళ | కర్నాటి సునంద కరుణాకర్ రెడ్డి |
| 6 | 7వ డివిజన్ | జనరల్ మహిళ | అయితగాని రాధ (స్వామి గౌడ్) |
| 7 | 8వ డివిజన్ | బి.సి. మహిళ | వజ్జ సంతోషిణి రమేష్ |
| 8 | 9వ డివిజన్ | యస్.టి. జనరల్ | అంగోతు ప్రదీప్ నాయక్ |
| 9 | 10వ డివిజన్ | జనరల్ | చిన్నాల జానయ్య |
| 10 | 11వ డివిజన్ | జనరల్ మహిళ | దండెంపల్లి నాగజ్యోతి పరుశరాము |
| 11 | 12వ డివిజన్ | యస్.సి.జనరల్ | మామిడి కార్తీక్ |
| 12 | 13వ డివిజన్ | జనరల్ | గుమ్ముల జానకి మోహన్ రెడ్డి |
| 13 | 14వ డివిజన్ | యస్.సి.జనరల్ | బొజ్జ శంకర్ |
| 14 | 15వ డివిజన్ | యస్.సి.జనరల్ | పెరిక నాగరాజు |
| 15 | 16వ డివిజన్ | యస్.సి. మహిళ | పెరిక స్వాతి (వినాయకరాజు చిట్టి) |
| 16 | 17వ డివిజన్ | జనరల్ మహిళ | జెర్రిపోతుల అశ్విని(భాస్కర్ గౌడ్) |
| 17 | 18వ డివిజన్ | బి.సి. మహిళ | గడిగ హిమబిందు శ్రీను |
| 18 | 19వ డివిజన్ | జనరల్ | గోగుల గణేష్ |
| 19 | 20వ డివిజన్ | జనరల్ | అల్లి సుభాష్ |
| 20 | 21వ డివిజన్ | జనరల్ | ఎం.డి. ఇబ్రహీం |
| 21 | 22వ డివిజన్ | బి.సి. జనరల్ | అమీనా ఫర్హీనా(సమద్) |
| 22 | 23వ డివిజన్ | బి.సి.జనరల్ | ఎం.డి. మహబూబ్ అలీ(ఇంతియాజ్) |
| 23 | 24వ డివిజన్ | బి.సి. మహిళ | అతీయా కౌసర్(షఫీ నవాజ్ ఖాన్) |
| 24 | 25వ డివిజన్ | జనరల్ మహిళ | జూలకంటి ధనలక్ష్మిశ్రీనివాస్ |
| 25 | 27వ డివిజన్ | బి.సి. మహిళ | సట్టు ధనలక్ష్మి శంకర్ |
| 26 | 28వ డివిజన్ | బి.సి. మహిళ | గుండెబోయిన పుష్పలత(వెంకన్న) |
| 27 | 30వ డివిజన్ | బి.సి. జనరల్ | మారగోని నవీన్ గౌడ్ |
| 28 | 31వ డివిజన్ | జనరల్ మహిళ | కౌసర్ (ఖయ్యూమ్ బేగ్) |
| 29 | 32వ డివిజన్ | జనరల్ మహిళ | బుర్రి చైతన్య శ్రీనివాన్రెడ్డి |
| 30 | 33వ డివిజన్ | జనరల్ మహిళ | రేగట్టే అండాలు(లింగస్వామి) |
| 31 | 34వ డివిజన్ | జనరల్ | ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి |
| 32 | 35వ డివిజన్ | బి.సి. మహిళ | ఇటీకాల మంగమ్మ (శ్రీను) |
| 33 | 36వ డివిజన్ | జనరల్ | పుట్ట వెంకన్న గౌడ్ |
| 34 | 37వ డివిజన్ | జనరల్ | నంద్యాల వీరబ్రహ్మనంద రెడ్డి |
| 35 | 38వ డివిజన్ | బి.సి. మహిళ | బోయినపల్లి వేదశ్రీశ్రీనివాస్ |
| 36 | 39వ డివిజన్ | బి.సి. జనరల్ | అల్లి మల్లిఖార్జున్ |
| 37 | 40వ డివిజన్ | జనరల్ మహిళ | బొడ్డుపల్లి లక్ష్మీ |
| 38 | 41వ డివిజన్ | జనరల్ | కేసాని వేణుగోపాల్ రెడ్డి |
| 39 | 42వ డివిజన్ | జనరల్ మహిళ | పబ్బు సాయిశ్రీ(సందీప్) |
| 40 | 43వ డివిజన్ | బి.సి. జనరల్ | ఎం.డి. ఖలీల్ |
| 41 | 44వ డివిజన్ | బి.సి. జనరల్ | ఎం.డి. ఇర్ఫాన్ అహ్మద్ |
| 42 | 45వ డివిజన్ | బి.సి. జనరల్ | ఎం.డి. అష్రఫ్ అలీ (అమేర్) |
| 43 | 46వ డివిజన్ | జనరల్ | ఎం.డి. ఫసహత్ అలీ (బాబా) |
| 44 | 47వ డివిజన్ | జనరల్ మహిళ | అబ్బగోని కవితరమేష్ |
| 45 | 48వ డివిజన్ | జనరల్ మహిళ | యామా కవిత దయాకర్ |
అభివృద్ధికి పట్టం కట్టండి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ పట్టణంలో ఇప్పటికే దాదాపు రూ. 2200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చే ఈ క్రతువులో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, నల్లగొండను అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.