బాలికలకు హైజీన్, శానిటేషన్, ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దు: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎంఈఓ(MEO)లు నెలలో వారి పరిధిలోని పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ఉపాధ్యాయులు, ఎంఈఓ(MEO)లు సెలవు పై వెళ్లకూడదని, జిల్లాలో టాయిలెట్ లేని పాఠశాల ఉండరాదని, విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడంలో భాగంగా హెడ్మాస్టర్లతో తరచూ సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

సోమవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న పీఎం శ్రీ పాఠశాలలు, టాయిలెట్స్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద పాఠశాల విద్యార్థులకు మంజూరు చేసిన నిధులన్ని సద్వినియోగమయ్యేలా చూడాలని, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్, బాలికల ఆరోగ్యం, శానిటేషన్, సైన్స్, మ్యాథ్స్, సర్కిల్స్ నిర్వహణ, ఎక్స్పోజర్ విజిట్లు, స్పోర్ట్స్ మెటీరియల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సెల్ఫ్ డిఫెన్స్,మాక్ పార్లమెంట్ నిర్వహణ, సేఫ్టీ క్లబ్బుల ఏర్పాటు, టీచర్ పేరెంట్స్ మీటింగ్ లు, తదితర విషయాలపై సమగ్రంగా సమీక్షించారు.

బాలికల హైజీన్, శానిటేషన్ ఆరోగ్యం విషయంలో రాజీ పడవద్దని, మ్యాథ్స్, సైన్స్ సర్కిల్ల వల్ల నూతన ఆవిష్కరణలు చేసే విధంగా విద్యార్థులను తయారు చేయాలని, విద్యార్థులకు ప్రఖ్యాత ప్రదేశాలు, స్థలాలు సందర్శించడం ద్వారా సమాజంపై అవగాహన కలిగే విధంగా ఎక్స్పోజర్ విజిట్లు నిర్వహించాలని, వీటిని నెల 17, 18 లో పూర్తి చేయాలన్నారు. స్పోర్ట్స్ మెటీరియల్, స్కౌట్స్ అండ్ గేమ్ మెటీరియల్ నాణ్యతతో ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలకు మంజూరు చేసిన మెటీరియల్ అంతా సరిచూసుకోవాలని, జిల్లాలో ఇంకా మెటీరియల్ తెప్పించని పాఠశాలలన్నీ ఈ నెల పది లోపల తెప్పించడమే కాకుండా, స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.

స్పెల్ఫ్ మాక్ పార్లమెంట్ తదితర కార్యక్రమాల ద్వారా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు పరోక్షంగా ఉపయోగపడతాయని, సేఫ్టీ క్లబ్ ల నిర్వహణ, ఆయా అంశాలపై నిష్ణాతులను పిలిపించి విద్యార్థులకు సెమినార్లు ఏర్పాటు చేయాలని, పాఠశాల విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి పాఠశాలలో వాల్ ను  ఏర్పాటు చేసి వారికి నచ్చిన విధంగా బొమ్మలేసేలా చూడాలన్నారు. తల్లిదండ్రుల సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. చిన్నచిన్న కారణాలవల్ల జిల్లాలో మూతబడిన  టాయిలెట్స్ అన్నింటిని తిరిగి వినియోగం లోకి తెచ్చేందుకు పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా అంచనాలు వేయించి సమర్పించాలని, జిల్లాలో టాయిలెట్ లేని పాఠశాల అన్నది ఉండకూడదని అన్నారు.

Share
Share