ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న అంగన్వాడి కేంద్రాలు, మూత్రశాలలు, అంగన్వాడి భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాల ప్రహరీ గోడలు, కాంపౌండ్ గోడలు, మూత్రశాలల నిర్మాణం వంటి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. చిన్నారులు మరియు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందేలా నాణ్యతతో పనులు చేయాలని సూచించారు.

అదేవిధంగా పీఎం శ్రీ పాఠశాలలు, మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ డి ఎఫ్, ఎంపీ లాడ్స్ నిధులతో చేపడుతున్న పనులు ఎక్కడైనా పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.

Share
Share