మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

నల్గొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో గత మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు ఓటరు జాబితా పై కసరత్తు చేశారు.  పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా సిద్దం చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను గురువారం రాత్రి విడుదల చేశారు. అయితే పురుషుల కంటే మహిళ ఓటర్లే  ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాపై ఈ నెల 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదే రోజున మున్సిపాలిటీలో, 6న కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.

మున్సిపాలిటీవార్డులుపురుషులుమహిళలు ఇతరులుమొత్తం
నల్గొండ48672357204125139301
సూర్యాపేట48566795220513108897
దేవరకొండ2011702122580123961
నందికొండ12643770660113503
హాలియా126,2706,5290212,801
మిర్యాలగూడ4845128478781493020
కోదాడ3528069305201258601
తిరుమలగిరి15763878170015,455
చిట్యాల12592961880112118
Share
Share