- 407 వార్డులకు ఎన్నికలు
- కాంగ్రెస్ 394, బీఆర్ఎస్, 372, బీజేపీ 328 వార్డుల్లో పోటీ
- కాంగ్రెస్, సీపీఐ పొత్తు, బీఆర్ఎస్, సీపీఎం, జనసేన పొత్తు
- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పోరేషన్లో మొత్తం 1617 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక పార్టీల వారీగా అభ్యర్థుల తుది జాబితా అధికారులు ప్రకటించారు. 407 వార్డులకు 3,209 మంది నామినేషన్లు వేయగా, 1592 మంది విత్డ్రా అయ్యారు. 407 వార్డుల్లో కాంగ్రెస్ 394, బీఆర్ఎస్ 372, బీజేపీ 338, సీపీఎం 27, సీపీఐ 5, జనసేన 43 వార్డుల్లో పోటీ చేస్తోంది.
327 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్, సీపీఎం, జనసేన, కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఒంటిరిగానే బరిలో దిగింది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ బరిలో నిలిచాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నేటి నుంచి అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. బుధవారం మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి సభతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు హీటెక్కనున్నాయి.
జిల్లాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు
| జిల్లా పేరు | వార్డులు | అభ్యర్థులు |
| సూర్యాపేట | 141 | 615 |
| నల్గొండ | 162 | 649 |
| యాదాద్రి | 104 | 353 |
| మొత్తం | 407 | 1617 |
పార్టీల వారీగా పోటీ చేస్తున్న స్థానాలు
| పార్టీపేరు | వార్డులు |
| కాంగ్రెస్ | 394 |
| బీఆర్ఎస్ | 372 |
| బీజేపీ | 338 |
| జనసేన | 43 |
| సీపీఎం | 27 |
| సీపీఐ | 05 |
జిల్లాల వారీగా పోటీ చేస్తున్న స్థానాలు, వార్డులు
| జిల్లాపేరు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | సీపీఎం | సీపీఐ | జనసేన |
| నల్లగొండ | 158 | 152 | 131 | 10 | 01 | 12 |
| సూర్యాపేట | 137 | 130 | 115 | 09 | 02 | 26 |
| యాదాద్రి | 99 | 90 | 92 | 08 | 02 | 05 |