కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ప్రజాసంక్షేమం కోసం, యూనియన్ లు ఉండాలి అని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
విధ్యుత్ ఉద్యోగుల సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి…
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరి గుట్ట పట్టణం లో లక్ష్మి నర్సింహ ఫంక్షన్ హల్ లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ పవర్ మెన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్, నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యులు శ్రీ డా. మల్లు రవి, MLC శ్రీ కోదండరాం తో కలిసి ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఈ కార్యక్రమం లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్, ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా, 1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగులు యూనియన్ నాయకులు ప్రముఖులు హాజరయ్యారు.