ప్రజలు మిమ్మల్ని అధికారం లోనుంచి తరిమేశారని మర్చిపోయారు కేసీఆర్: ఎంపీ చామల

భారత దేశంలో కేసీఆర్ చదివిన పుస్తకాలు ఎవరు చదవలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్లకు తెలియక రాసుకోలేదు. కేసీఆర్ వచ్చి ఎండగట్టడం కాదు.. వచ్చి అక్కడ కూర్చున్న..పదేళ్ళ అప్పుల వివరాలు బయట పడుతాయి. మీరు చేసిన తప్పులు మేము చేయకుండా చూసుకుంటారు. జనాలు అధికారం లోనుంచి మిమ్మల్ని తరిమేశారు అని మర్చిపోయారు. ఎందుకు అధికారం పోయింది అనేది తెలుసుకుంటారు అనుకున్నాం. తప్పులు ఏంటి.. ఎందుకు ప్రజలు ఓడించారు అని సమీక్ష చేసుకుంటారు అనుకున్నాం..కానీ మీ మాటలు చూస్తే.. మరేటట్లు లేరు.

ఇప్పుడు ఎన్నికలు పెట్టిన వంద సీట్ల వస్తాయని అనుకుంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఉండేవారు. ఇంకా ఫాం హౌస్ లో కూర్చొని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు కంటక్టర్లకు చెల్లించని 35 వేల కోట్ల బిల్లు మేము చెల్లిస్తున్నం. మీ తప్పులు మేము మొస్తున్నం.. రైల్వే లో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి తో మంత్రిని కలిశాం. 12 శాతం వడ్డీ తో అప్పులు ఏ రాష్ట్రం అయిన చేస్తుందా? కేంద్రం నుంచి నిధుల కోసం పదేపదే డిల్లి కి వెళ్లి కలిస్తున్నాం దానిని కూడా హేళన చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ల కోసం ఆల్ పార్టీ ఎంపీల సమావేశం పెట్టడం జరిగింది. గత ఏడాది లో ఎన్ని సార్లు ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిశాం అనేది వివరంగా బుక్ ఎంపీలకు ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

28 అంశాలలో ఉత్తరాది రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది. ఐఏఎస్ అధికారులను ఇవ్వడం లో కూడా వివక్ష చూపుతున్నారు. ఇవన్నీ పార్లమెంట్ లో చర్చకు లేవనెత్తుతాం. ఈ 28 అంశాలను పార్లమెంట్ లో ప్రశ్నిస్తే వంద శాతం గెలిపించిన ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. తెలంగాణ అభివృద్ధి మీద బీజేపీ ఎంపీలకు చిత్త శుద్ధి లేదు. కాంగ్రెస్ అధికారంలో సమయంలో అభివృద్ధి జరుగుతే వాళ్ళకీ కాంగ్రెస్ కి పేరు వస్తుందని దురుద్దేశం తో అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. రాజకీయాలు పక్కన పెట్టీ అందరు కలసి అభివృద్ధి కృషి చేయాలి.

పదేళ్ళ దౌర్భాగ్య పాలన ఫలితమే ఇది.. మీ తప్పులు మాఫీ చేసే అక్షయ పాత్ర ప్రభుత్వం లేదు. ఊహాగానాల తో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా పాలన లో ప్రజలు మంత్రులను స్వేచ్చగా కలిసే అవకాశం ఉంది. గతంలో మాదిరి మేము ఎవరిని అడ్డుకోమూ అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Share
Share