మట్టిలోంచి మాణిక్యాలను వెలికితీసే మహోన్నత కార్యక్రమం: ఎంపీ చామల

ఆలేరు, ఏపీబీ న్యూస్​: డా. ఆరుట్ల కమలాదేవి-రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి (ఉన్నత పాఠశాలల బాల బాలికలకు)ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలకు ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు, వివిధ మండలాల నుండి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ లో గౌరవ వందనం స్వీకరించారు.

mp chamala alair 2

ఎంపీ చామల మాట్లాడుతూ: తెలంగాణ ముద్దుబిడ్డలైన ఆరుట్ల దంపతుల పోరాట స్ఫూర్తిని ఈ స్మారక క్రీడల నిర్వహణ కమిటీ ద్వారా బాలబాలికల్లో క్రీడాస్ఫూర్తిని, సంఘటిత శక్తిని, ఎత్తుగడల నైపుణ్యాన్ని పెంపొందించి విజయాలను ఎలా సాధించవచ్చో తెలియజేస్తూ, ఈ మట్టిలోంచి మాణిక్యాలను వెలికితీసే మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు, వారి ఆశయాల బాటలో మన ఆకాంక్షలు సఫలమయ్యే లక్ష్యంతో ముందుకు సాగుదాం! ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లోని బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, డా. కమలాదేవి స్మారక క్రీడల్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

mp chamala alair 1

ఈ కార్యక్రమంలో కొత్త మహదేవ్ రెడ్డి, GHM ZPHS ఆత్మకూర్ (యం) కన్వీనర్, ఆరుట్ల స్మారక క్రీడోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మునుగోడు సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, సి.పి.ఐ. పార్టీ సినీయర్ నాయకులు యానాల దామోదర్ రెడ్డి, ఆత్మకూరు సర్పంచ్ బీసు ధనలక్ష్మీ, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

mp chamala alair 5
mp chamala alair 6
mp chamala alair 3
Share
Share