2025 నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు సంతాప దినాలు ఉన్నందున పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా క్యాజువల్ గా విషెస్ చెప్పిన ఎంపీ.
మొదటి సంవత్సరం ప్రజా పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి సమీక్ష చేశారు. ప్రజాపాలన గురించి వారు చేసిన దిశా నిర్దేశం గతానికంటే భిన్నంగా స్ఫూర్తిదాయకంగా ఉంది.
సీఎం గారు గతంలో కంటే భిన్నంగా మార్పు కోరుకుంటూ వారే స్వయంగా మంత్రులకు ఫోన్లు చేసి నూతన సంవత్సరం సందర్భంగా వారితో మాట్లాడటం జరిగిందని, మీరు కూడా మీ మీ స్థాయిలో మీ కింది నాయకులకు,కార్యకర్తలకు ఫోన్లు చేసి మాట్లాడాలని సూచించారు.
నూతన సంవత్సర వేడుకలకు భిన్నంగా కార్యాచరణ దిశగా బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలని సీఎం గారు చెప్పారు.ప్రజా ప్రతినిధుల మొదటిసారి గెలవడం మీ గొప్ప కాదు, రెండోసారి గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా క్యాడర్ ను కలుపుకొని ముందుకెళ్లాలని, ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వారికి వివరించాలని మాకు దిశా నిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యంగా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. మొదటిసారి గెలవడం గొప్పకాదు రెండోసారి గెలిచిన వారే నాయకులు అని, చేవెళ్ల మాకందరికీ గుర్తు చేశారు. రాజకీయంగా వారు అంచలంచలుగా ఎదిగిన తీరును మాకు వివరించారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కలిసికట్టుగా ఎటువంటి గ్రూపు తగాదాలు లేకుండా పనిచేయాలని కోరారు. చిన్నచిన్న గ్రూప్ తగాదాలు ఉన్న కాడ సర్దుకుపోయి ముందుకెళ్లాలని మాకు సూచించారు.
ఈ రోజు సీఎం ని కలిసిన తర్వాత నాకు సమాజం పట్ల మరింత బాధ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందని అనిపించిందని ఎంపీ అభిప్రాయపడ్డారు.