నకిరేకల్(APB News):
లిస్టులో పేర్లు రాని వారు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, అర్థులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి.. వాస్తవలకు దగ్గరగా ప్రజాపాలన ఉండాలనే లక్ష్యం తోనే గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తిస్తున్నాం.. ఈ నాలుగు సంక్షేమ పథకాల గురించి లిస్ట్ లో పేర్లు రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం…..

ప్రజా పాలనలో భాగంగా ఈ రోజు నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లకి గ్రామం మరియు రామన్నపేట పట్టణంలో రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డులకు జాబితా ఆమోదించుట కొరకు నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమాలలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాల అమలు కోసం గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆ నిరుపేదలను గుర్తించడం ప్రతి మండలంలోని అధికారుల బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు హైరానా పడకుండా ఉండాలని కోరారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అసలైన లబ్ధిదారులను గుర్తించడం కోసమే ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అని అన్నారు.