ఇప్పటికైనా కోర్టులను, చట్టాలను గౌరవించు కేటీఆర్. ఈరోజు హైకోర్టు కూడా నీ కేసును చూసిన తర్వాత నీ గొప్పతనాన్ని గుర్తించి, మీరు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టి వేసిన తర్వాత మీకు అర్థమై ఉంటది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, మీ పైన ఫార్ములా ఈ రేస్ కేసు నమోదు అయిన తర్వాతమీరు మేకపోతు గాంభీర్యంతో నన్ను అరెస్టు చేసుకోండి, కావాలంటే జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అని తొడలు కొట్టినవు కేటీఆర్, నిన్న ఈడి సమన్లు జారీ చేసిన తర్వాత మా లీగల్ టీం ను అనుమతించలేదని ఏవో కథలు చెప్పి డ్రామాలు ఆడినావ్…నాపై తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు,నా ఇంట్లోకి ఒక అజ్ఞాత వ్యక్తిని పంపించి ఏదో ఆధారాలు పెట్టిండ్రు అని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించినవు. ప్రతి దానిని రాజకీయం చేస్తూ స్టోరీలు చెబుతూ డ్రామాలు ఆడొద్దు కేటీఆర్ అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి KTR పై ధ్వజమెత్తారు.