బీబీనగర్ ఎయిమ్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన: ఎంపీ చామల

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) ను భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

mp chamala inspects bibinagar aiims hospital 3

ప్రతి రోజు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, వాళ్లకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, అవసరమైన పేషెంట్ లకు ఆపరేషన్లు చేస్తున్నారు లేదా అని ఆరా తీసారు. క్యూ లైన్ లో నిల్చున్న ప్రతి పేషెంట్ ను పలకరిస్తూ, డాక్టర్ లు సమయానికి వస్తున్నారా, అన్ని ఎక్యుమెంట్స్ ఉన్నాయా?సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ లో సిబ్బంది నియామకం జరుగుతుందా? జరిగితే ఎ ప్రాతిపాదికన జరుగుతుంది? దీనిని ఎ ఏజెన్సీ నిర్వహిస్తున్నది? దిని లో లోకల్ వాళ్ళ కి ఎంత వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? సిబ్బంది నియామకంలో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలాంటివి జరగకుండా పారదర్శకంగా ఉండాలని అన్నారు.

mp chamala inspects bibinagar aiims hospital 5

మిగతా సివిల్ వర్క్స్ ఎంత వరకు పూర్తి అయ్యింది? పూర్తి కాకా పోతే ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? పేషెంట్ లకు అని సౌకర్యాలతో బిల్డింగ్ లు అందుబాటులోకి ఎప్పుడు వస్తాయి అడిగారు. బిల్డింగ్ నిర్మాణాలు తర్వాగ పూర్తి చేస్తామని గతంలో చెప్పిన వాయిదాల దాటిపోయాయి అని గుర్తు చేస్తూ తర్వగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, డిప్యూ డైరెక్టర్ డాక్టర్ విపిన్ వర్గీస్ పాల్గొన్నారు.

mp chamala inspects bibinagar aiims hospital 4
mp chamala inspects bibinagar aiims hospital 1
Share
Share