కేటీఆర్ నువ్వు మహా డ్రామా రావు..నీ నటనకు ఆస్కార్ అవార్డు: ఎంపీ చామల

బ్రిస్బేన్(APB News): తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది..కేటీఆర్

తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టకు…కేటీఆర్

నువ్వు మహా డ్రామా రావు అని తెలుసు ప్రజలకు..నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది…తెలంగాణలో మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంత లాగా మీ నాయన నువ్వు వ్యవహారించారు. నీ బాగోతం…నువ్వు, తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసు…

FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్ కి నేనే తీసుకొచ్చాను, దానిని కాపాడాలని ఇది హైదరాబాద్ కి తలమానికం అని, అందుకోసమే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని గొప్పలు, ప్రగల్బాలు పలుకుతున్నావు కేటీఆర్, నిజ నిజాలు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏస్ నెక్స్ట్ జెనరేషన్స్ గ్రీన్‌కో సంస్థ యాజమాన్యం నీకు అత్యంత దగ్గర మిత్రులు అని తెలంగాణ ప్రజానీకానికి తెలుసు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

Share
Share