ఢిల్లీలో మీడియా తో మాట్లాడిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
రైతుల సంక్షేమం కోసం BRS 85 వేల కోట్లు 10 ఏళ్లలో ఖర్చు చేస్తే… మేము ఒక్క ఏడాదిలోనే 53 వేల కోట్లకు పైగా ఖర్చు చేసాం… కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనం.
బీఆర్ఎస్ ఏడాదికి ఖర్చు చేసింది 7 వేల కోట్లు దాటలేదు. బడా బాబులకు,రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే కొండలు గుట్టలకు రైతుబంధు వేసి 20 వేల కోట్లు వృధా చేశారు. హామీల అమలు చేయలేకపోవడానికి బిఅరెస్ చీకటి జీవోలే కారణం. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసేలా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సాగింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను గమనించాలి.
కేంద్రం సాగు చేసే రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్న ఇచ్చేది 6 వేలు మాత్రమే…. రైతుల పై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను మోడీని ఒప్పించి దేశమంతా ఇప్పియ్యాలి. రాజకీయ నేతలు రాజకీయాలు చేసేందుకు చెప్పే ప్రచారాలను నమ్మకుండ ప్రజలు వాస్తవాలను గమనించాలి.
20 వేల కోట్లు రోడ్లకు, పాడవు బద్ధ భూములకు, బిల్డింగ్ లకు ఎందుకు ఇచ్చారో కేటీఆర్ చెప్పాలి, ప్రజలే కేటీఆర్ కు గుణపాఠం చెప్తారు. వరి వేస్తే ఊరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్ కు రైతులపై మాట్లాడే అర్హతలేదు. 55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి పంపిస్తే….ఈడీ విచారణకు పిలిస్తే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు. రేవంత్ రెడ్డి నిజాం నవాబు లా వ్యవహరించడం లేదు, మా మంత్రులు నిలబడలేదని ఇష్టరీతిన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులను మీ ఇంటి కాడ అటెండర్లుగా చూశారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ సంస్కృతి కాదు. సోషల్ మీడియా ద్వారా సీఎం ను చిన్నబుచ్చే కుట్ర కేటీఆరే చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని యాంకర్లకు సీఎం లు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా?
రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా అన్నారు..