కిషన్ రెడ్డి మోడీ క్యాబినెట్లో మంత్రి వా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాలేరువా?: ఎంపీ చామల

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్ళజోడు తీసేసి చూడు అన్ని సజావుగానే కనిపిస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి బృందం దావూస్ పర్యటన, తెచ్చిన పెట్టుబడుల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గాంధీభవన్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్….

గత పది సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి చేసి చూపిస్తుంటే, వాళ్లు 9 సంవత్సరాల లో తేలేని పెట్టుబడులను తెచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన చేస్తుంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటే నిన్న వాళ్లకు ఈ నో(ENO) ప్యాకెట్స్ తాగమని చెప్పాము. దానికి తోడు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మోడీ క్యాబినెట్లో మంత్రినా…..కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెద్ద పాలేరా? KCR కాలికి ముల్లుకుచ్చుకుంటే కిషన్ రెడ్డి నోటితో తీస్తా అనే విధంగా మాట్లాడుతుండు.

తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అభివృద్ధికి భిన్నంగా మాట్లాడితే ఊరుకునేది లేదు కిషన్ రెడ్డి గారు…1,78,950 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్లికూతురు ముండ మోసిందట అనే సామెత మాదిరి మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి.

బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు స్క్రిప్టులు షేర్ చేసుకొని మరీ ప్రెస్ మీట్ లలో మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పన కోసము దావుస్ వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిపక్షాలు అబద్ధాలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కిషన్ రెడ్డి మోడీ ప్రతినిధిన… కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాలేరు నా… తెలంగాణ ప్రజల వల్లనే మీకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయి కదా…మరి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే మంచి అనే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. టిఆర్ఎస్ బాటలోనే మీరు వెళ్తున్నారు.

తెలంగాణ ఏ దేశంలో ఉంది కిషన్ రెడ్డి, మీరు బాధ్యతగల హోదాలో ఉన్నారు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క తెలంగాణ నుండే దావుస్ కి వెళ్లలేదు దేశవ్యాప్తంగా అందరూ వెళ్లారు. గులాబీ కళ్లజోడుతో చూడడం ఆపితే మీకు అన్ని కనిపిస్తాయి కనువిప్పు కలుగుతుంది. బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ విషయంపై టిఆర్ఎస్ ఎందుకు స్పందిస్తలేదు,ఈటెల విషయాన్ని మీరు ఏకీభవిస్తున్నట్ట. టిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే అని తెలంగాణ ప్రజలకు అర్థమయిపోయింది.

మీ బిజెపి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల నుండి కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు వెళ్లారు కదా…మీ బిజెపి ముఖ్యమంత్రులను,మీ బిజెపి మంత్రులను సవాల్ చేయగలుగుతావా కిషన్ రెడ్డి? మీరు దేశానికి మంత్రి రాష్ట్రం గురించి మాట్లాడొద్దు..లేనిపోని అబండాలతో పెట్టుబడిదారులను తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధాలు మాట్లాడడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలి అంటూ కిషన్ రెడ్డి పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Share
Share