కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు. సబ్కే సాత్ సబ్ కా వికాస్, అచ్చే దిన్ ఆనే వాలే హై, వికసిత భారత్, ఆత్మ నిర్భర భారత్, ఘర్ ఘర్ రోజ్ గార్ అని నినాదాలు చేసే కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు.
దేశంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 60 శాతం రైతాంగానికి బడ్జెట్లో 3.8% కేటాయించారు. 2024 25 లో 1.41 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే దాన్ని 1.37 లక్షల కోట్లకు తగ్గించారు. దేశంలో ఉన్న రైతులు కనపడటం లేదా కార్పొరేట్ స్నేహితులే కనపడుతున్నారా? కార్పొరేట్లకు 3 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. పదేళ్లలో రైతులకు ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేశారు? కేంద్ర ప్రభుత్వానికి రైతుల గురించి ఆలోచించే సమయం లేదా పంటలకు మద్దతు ధర ,ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం లేదు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కి 22.9 శాతం నిధులు తగ్గించారు. కాంగ్రెస్ రైతుల పక్షాన ఉంది. మన్మోహన్ సింగ్ హయాంలో 60 వేల కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో 22.35 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం..బడ్జెట్లో 20 శాతం నిధులు రైతుల కోసం తెలంగాణలో ఖర్చు చేస్తున్నాం..తెలంగాణలో రైతుల కోసం ఖర్చు చేసేది కేంద్రంలో రైతుల కోసం ఖర్చు చేసే నిధులను బేరీజు వేయాలి.
ఎకరానికి రైతు భరోసా కింద 12 వేల రూపాయలు రైతులకు అందజేస్తున్నాం. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 40 లక్షల ఎకరాల్లో పంట సాగు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. దేశవ్యాప్తంగా చిన్న ,సన్నకారు రైతులకు రుణమాఫీ చేయాలి. దేశంలో నీటిపారుదల ప్రాజెక్టఎంపీ నిధులను పెంచాలి. రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పారదర్శకంగా అందజేయాలి అని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేసారు.