గెలవాలన్న ఆశ బీజేపీకి,గెలిపించాలన్న ఆశ ఫాం హౌస్ లో ఉన్నాయనకి ఉంది: ఎంపీ చామల

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు ఓబీసీ కేటగిరిలోనే ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా అక్కడ ముస్లింలు ఓబీసీ కేటగిరిలోనే ఉన్నారు. ఓట్ల కోసం బీజేపీ నాయకులు అబద్ధాలు చెపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ఇండియాకి రప్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్ నిందితులను తెలంగాణ బీజేపీ నేతలు రక్షిస్తున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ బీజేపీ కార్యకర్తల లాగా పనిచేస్తున్నారు. కారు రేసింగ్ విషయంలో ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదు. గెలవాలన్న ఆశ బీజేపీకి ఉంది. గెలిపించాలన్న ఆశ ఫాం హౌస్ లో ఉన్నాయనకి ఉంది. బండి సంజయ్ మైక్ ముందు పెడితే ఎది పడితే అది మాట్లాడుతారు. కులాలు, ముస్లింలు, ఇండియా, పాకిస్థాన్ తప్పా మాట్లాడడానికి ఏం లేదా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Share
Share