క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన: ఎంపీ చామల

తుంగతుర్తి, ఏపీబీ న్యూస్: శాలిగౌరారం మండలం లో C.M.R ఫంక్షన్ హాల్ లో క్రికెట్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామల్ తో కలిసి వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.

ఎంపీ చామల మాట్లాడుతూ: మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుల ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యం అని తెలిపారు.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గత ఏడాది విజయవంతంగా సీఎం కప్పు నిర్వహించినట్లే, ఈ సంవత్సరం నిర్వహిస్తారు అన్నారు. యువత క్రీడలు ఆడడం వల్ల మనసికంగా మరియు శారీరకంగా దృఢత్వం కలిగి ఉండి నిత్య జీవితంలో కూడా ప్రతి విషయంలో పోటీ తత్వం కలిగి ఉండి ముందుకు వెళ్తారు అన్నారు.

mp chamala distributes cricket kits in Shaligouraram team

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా చెడు వ్యసనాలకు బానిసలైతూ తమ యొక్క బంగారు భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు అన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి యువకులలో క్రీడా ప్రతిభను వెలికితీస్తూ మన రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వాళ్లకు ఈ క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, నూతనంగా  ఎన్నికైన సర్పంచులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Share
Share