రాష్ట్ర ప్రజలకు భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ చామల

ఆస్ట్రేలియాలోని BRISBANE నగరంలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సెలబ్రేషన్స్ కి ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ అధ్యక్షులు శ్రీ ఉమా చిలిటోలి, ఉపాధ్యక్షులు రామ్ జొన్నూరి మరియు NRI లు పాల్గొన్నారు.

భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ప్రపంచం నలుమూలల స్థిరపడినటువంటి తెలంగాణ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఎంపీ చామల పత్రికా ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

భోగి, సంక్రాంతి ప్రజలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గా పండుగ జరుపుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

img 20250112 wa000688745091028341746
img 20250112 wa00051590403178617719856
img 20250112 wa00043936825993341117240
img 20250112 wa00038390061782392758327
Share
Share