హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ప్రభాస్ భారతీయ దినోత్సవం సందర్భంగా హైటెక్ సిటీ టెక్ మహీంద్రా ఆడిటోరియంలో ప్రవాసీ భారతీయ దివస్ అవార్డ్ ల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రవాసీలైన భారతీయులు వివిధ రంగాలలో కృషి చేసిన వారి సేవలకు గాను ఈ ప్రవాసీ భారతీయ దివస్ అవార్డులను ప్రదానం చేశారు.
ఎంపీ చామల మాట్లాడుతూ: ప్రపంచంలో ఏ మూలన ఉన్న గుండె చప్పుడు మాత్రం మాతృభూమి కోసమే అంటూ భారత సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న ప్రవాస భారతీయులందరికీ ప్రవాస భారతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 9న జరుపుకునే ప్రవాసీ భారతీయ దివస్ (PBD), 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చినందుకు గుర్తుగా మరియు భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల కృషిని గౌరవించే వేడుక. 2003 నుండి జరుపుకుంటున్న దీనిని నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) దినోత్సవం అని కూడా పిలుస్తారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ శాసనసభ్యులు ఫైడి రాకేష్ రెడ్డి, జోగులాంబా గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మలిచేటి రాజీవ్ రెడ్డి, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ బి వినోద్ కుమార్, ఎన్ఆర్ఐ సలహా కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యుడు ఎన్ దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.