Breaking News: మధర్​ డెయిరీతో ఎన్​డీడీబీ డీల్​.. ఎట్టకేలకు దిగొచ్చిన పాలకవర్గం

నల్లగొండప్రతినిధి, ఏపీబీన్యూస్: నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఈ మేరకు ఆదివారం పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలోని బృందం గుజరాత్ వెళ్లి ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్ షాతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విజయడెయిరీ, మధర్ డెయిరీ చైర్మన్లు గుత్తా అమిత్ రెడ్డి, గుడిపాటి మధుసూదన్ రెడ్డిలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధర్ డెయిరీ ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఏవిధంగా బయట పడాలనే అంశాల పైన మంత్రి శ్రీహరితో ఎన్డీడీబీ చైర్మన్తో జరిపిన చర్చలు కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా మొదటి విడతలో ఎన్డీడీబీ రూ.10 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మదర్ డెయిరీ, ఎన్డీడీబీ మధ్య ఎంఓయూ(MoU) జరిగిన అనంతరం రెండో విడత ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. గుజరాత్లో జరిగిన అంశాల పైన చర్చించేందుకు సోమవారం డెయిరీ పాలకవర్గం భేటీ కానుంది.

మంగళవారం సర్వసభ్య సమావేశం ఉన్నందున ఈలోగానే సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి వాకిటి శ్రీహరి, సమన్వయ కర్తలుగా ఎంపీ చామల, గుత్తా అమిత్ రెడ్డి వ్యవహారిస్తున్నందున డెయిరీ సమస్యలు కొలిక్కి వస్తాయనే భావిస్తున్నారు. ఇదిలావుంటే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సొసైటీ చైర్మన్ లు నోటీసులు ఇవ్వడంతోనే ఈ ప్రక్రియ ముందుకు సాగింది. మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి చొరవ తీసుకుని చైర్మన్ లను ఏకతాటిపైకి తెచ్చారు. సర్వసభ్య సమావేశంలో తాడోపేడో తేల్చుకునేందుకు చైర్మన్లు సిద్ధమైన క్రమంలో డెయిరీ పాలకమండలి దిగిచ్చొంది.

Share
Share