APB News Exclusive: మధర్​ డెయిరీ స్కాం రూ.50 కోట్లు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (NARMUL)లో జరిగిన అక్రమాల చిట్టా బయట పడింది. గత మూడు నెలల నుంచి సాగిన విచారణలో సుమారు రూ.50 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్టు విచారణలో తేలింది. డెయిరీ లో చోటుచేసుకున్న అక్రమాల పైన విచారణ చేయాలని తెలంగాణ రైతు లింగయ్య చేసిన ఫిర్యాదు మేరకు విచారణ అధికారిగా రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్టార్, డీసీఓ చిర్రా సుధాకర్ను ప్రభుత్వం నియమించింది. గత పదేళ్లలో 2017 మినహా మిగితా 9 ఏళ్లు డెయిరీ నష్టాల్లోనే నడిచిందని, కానీ అప్పటి అధికారులు, పాలకవర్గాలు, ఆడిటర్లు కుమ్మకై లాభాలో ఉన్నట్టు బోగస్ లెక్కలు సృష్టించారని, ఆడిట్ రిపోర్ట్లను అడ్డంపెట్టుకుని బ్యాంకులను కూడా మోసం చేశారని, కోట్ల రూపాయాల రుణాలు పొందారని అధికారులు తేల్చారు. కేవలం 2017లో మాత్రం డెయిరీ లాభాల్లో నడిచిందని, 2015 నుంచి 2026 ఇప్పటి వరకు నష్టాల్లోనే ఉందని తేల్చిన ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ను ఆడిటర్ కూడా సర్టిఫై చేశారు.

ఈ మేరకు గత పదేళ్లలో డెయిరీ చైర్మన్లు, డైరక్టర్లు పనిచేసిన వారితోపాటు, అప్పటి మేనేజింగ్ డైరక్టర్లు, డీజీఎంలు, ఆడిటర్లు, సిబ్బందికి ఎంక్వైరీ అధికారి చిర్రా సుధాకర్ ఈ నెల 23న సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 15 నుంచి 23 వరకు NARMULలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగుతుంది. మ్యాక్స్ చట్టం 1995 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవని నోటీసులో స్పష్టం చేశారు. విచారణలో అధికారులు అడిగే ప్రశ్నలకు వారంతా బదులు చెప్పాల్సి ఉంటుంది. అధికారులు జరిపే విచారణను రికార్డ్ చేస్తారు. దీన్ని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 15న మాజీ చైర్మన్లు గుత్తా జితేందర్ రెడ్డి, ఎల్. శ్రీధర్ రెడ్డి, గంగుల కృష్ణారెడ్డి, డైరక్టర్లు కె.జలేందర్ రెడ్డి, సీహెచ్ వెంకట్రామ్ రెడ్డి, ఓ.బిక్షపతి, యు. శ్రీనివాస్రావు, బి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె.శ్రీ శైలం, ఏప్రిల్ 16న పి.భూపాల్ రెడ్డి, ఎం.పూలమ్మ, సీహెచ్. సురేందర్రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కె.జయశ్రీ, అరుకుల గాల్ రెడ్డి, కట్కూరి రామిరెడ్డి, దొంతురి సోమిరెడ్డి, కత్తి వెంకటరెడ్డి, 17న పి.వెంకట్రాం రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, కందుల అలివేలు, ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూధన్ రెడ్డి, కట్కూరి పాండు, గొల్లేపల్లి రామిరెడ్డి, మందడి ప్రభాకర్ రెడ్డి, పుప్పాల నర్సింహాలు, మండలి జానయ్య, ఏ.నర్సింహారెడ్డి, బత్తుల నరేందర్ రెడ్డి.

ఏప్రిల్ 22న అకౌంట్స్ ఆఫీసర్లు కె.రామారావు, అబ్దుల్ గఫార్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు జె.సుధీర్ రెడ్డి, సీనియర్ అకౌంటెంట్ ఎం. ఉమ, బి. రఘుమారెడ్డి, ఎఫ్ఎస్ కె.లక్ష్మీనర్సయ్య, జూనియర్ అకౌంటెంట్లు బి. వెంకన్న, కె. అరుణ.

మేనేజింగ్ డైరక్టర్లు ఏప్రిల్ 23న బి.యుగంధర్ రెడ్డి, ఎన్. రమేష్, వి. అశోక్ కుమార్, బి.కృష్ణలకు సమన్లు జారీ చేశారు. బోగస్ లెక్కలు సృష్టించి రూ.50 కోట్ల అక్రమాల వ్యవహారంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కూడా ఉందని ఎంక్వైరీ కమిటీ తేల్చిన నేపథ్యలో అప్పుడు జరిగిన వాస్తవాలను అధికారులకు వివరించాల్సి ఉంటుంది.

Share
Share